📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Achchennaidu: బంగ్లాదేశ్ చెర నుంచి మత్స్యకారులకు విముక్తి

Author Icon By Rajitha
Updated: February 3, 2026 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాకుళం : బంగ్లాదేశ్ నౌకాదళం చెరలో చిక్కుకున్న తొమ్మిది మంది విజయనగరం జిల్లా మత్స్యకారుల విడుదల వ్యవహారం సుఖాంతమైంది. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తన శాఖాపరంగా తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, దౌత్యపరమైన ఒత్తిడి కారణంగా మత్స్యకారులు సోమవారం క్షేమంగా విశాఖ తీరానికి చేరుకున్నారు. అధికారులు వారికి స్వాగతం పలికారు. మూడు నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడటంతో వారి సంబరాలు మిన్నంటాయి. వారి నివాసాలకు చేరుకున్నారు. గత అక్టోబర్ లో మత్స్యకారులు అన్యదేశంలో బందీలుగా చిక్కుకుపోయారన్న వార్త తెలియగానే మంత్రి అచ్చెన్నాయుడు అత్యంత వేగంగా స్పందించారు.

Read also: Tirumala: శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

Fishermen freed from Bangladesh captivity.

కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా, ప్రతి దశలోనూ వ్యక్తిగత పర్యవేక్షణ చేశారు. మత్స్యశాఖ మంత్రిగా అధికారులను వెంటనే అప్రమత్తం చేసి, పడవ రిజిస్ట్రేషన్ వివరాలు, మత్స్యకారుల చిరునామాలను సేకరించి కేంద్ర విదేశాంగ శాఖకు నివేదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మెహన్ నాయుడు వద్దకు స్వయంగా సమస్యను వివరించారు. మత్స్య కారుల దీనస్థితిని వివరించి కేంద్ర హోంమంత్రి అమిల్షాకు లేఖ రాయించడంలో కీలక పాత్ర పోషించారు. మూడు నెలలు కాలంలో విడుదల కావడంలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కృషి అభినందనీయమని మత్స్య కారులు తమ సంతోషాన్ని పంచుకున్నారు.

మత్స్యకారుల క్షేమమే మాకు ప్రథమ ప్రాధాన్యం

భారత కోస్టార్డ్, బంగ్లాదేశ్ అధికారులతో మత్స్యశాఖ ఉన్నతాధికారులు నిరంతరం ఉండేలా చూస్తూ, విడుదల ప్రక్రియలో ఎదురైన సాంకేతిక అడ్డంకులను తొలగించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి విడుదలైన మత్స్యకారులు సోమవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. తమను సురక్షితంగా రప్పించడంలో అహర్నిశలు కృషి చేసిన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు మత్స్యకారుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజుతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మత్స్యశాఖ మంత్రిగా మా మత్స్యకారుల క్షేమమే మాకు ప్రథమ ప్రాధాన్యం. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు ఉన్నా, కేంద్ర ప్రభుత్వ సాయంతో వారిని రప్పించగలిగాం. ఆపదలో ఉన్న మత్స్యకారులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Achchennaidu Andhra Pradesh bangladesh fishermen latest news Telugu News Vizianagaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.