📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : accidents: ప్రమాదాలకు ఎక్కువభాగం కారణం నిర్లక్ష్యమే

Author Icon By Sudha
Updated: November 5, 2025 • 5:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అక్కడ, ఇక్కడ అని లేకుండా ఎక్కువగా ప్రభుత్వ రం గంలో ఈనిర్లక్ష్యమనేది ప్రజలకు నరకంగా మారుతోం ది. ఏ వ్యక్తికైనా, ఏ ప్రభుత్వ రంగానికైనా సొంత ఎజెండా తప్ప ప్రజా సంక్షేమం పట్టదు. అనేక పుణక్షేత్రాల్లో దర్శనా లకు, స్నానాలకు, వెళ్ళిన వాళ్ళు, అనేక పార్టీ మీటింగుల్లో అభిమానంతో నాయకుడి జెండా మోయడానికి వెళ్ళినవాళ్లు మృత్యువాత పడడం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల సమ యంలో ప్రజల్ని గాలికొదిలేసిన ప్రభుత్వాలను చూస్తున్నాం. పరిశ్రమల్లోను, రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాలకు (accidents)ఎక్కువభాగం కారణం నిర్లక్ష్యమే . కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అధికార యంత్రాంగాల నిర్లక్ష్య ధోరణే కోట్ల మంది ప్రాణాలు హరించింది. ప్రభుత్వ రికార్డ్కులెన ఆధార్ కార్డ్ లాంటి వాటిల్లో అడ్రసు నమోదు చేసే సమ యంలో ఇష్టా రీతిన తప్పులు రాసి దాన్ని సరిదిద్దడానికి మరలా వారి చుట్టే తిరగాల్సి రావడం ప్రజల దౌర్భాగ్యం. అనేక ప్రభుత్వాసుపత్రుల్లోను, బ్యాంకుల్లోను వచ్చే జనం కోసం ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయకుండా చిన్నస్థాయి ఉద్యోగి నుండి అధికార్ల దాకా అందరూ ప్రజల్ని విసుక్కుంటూ మహిళలు, పిల్లలు, పెద్దవాళ్లు అనేది లేకుండా, ప్రతిపనికి గంటల తరబడి క్యూలో నిలబెడుతూ వారి సహనానికి పరీక్ష పెడతారు. ఏ వ్యవస్థ అయినా అది ప్రజలవల్లే నడుస్తుందనేది గుర్తించరు. చెమటోడ్చి రూపాయి రూపాయి కూడగట్టిన సొమ్ము అనారోగ్య సమయంలో కొన్ని హాస్పిటల్స్ లో నిర్లక్ష్యం వల్ల డబ్బు,ప్రాణాలు రెండూ పోతున్నాయి. ఇటీవల అంతులేని ఆశ్చర్యపోయే నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటన తెలంగాణాలో చూశాం. హైదరాబాద్ ఏరియా హాస్పిటల్లో ఓ.పి. చీటి రాయడానికి ఒక వ్యక్తిని రూల్స్ కారణంగా నిరాకరించి నిర్లక్ష్యం చేయడమేకాక అదే వ్యక్తి స్పృహకోల్పోయిన సందర్భంలో సిబ్బంది చనిపోయినట్లుగా నిర్ధారించి మార్చురీకి పంపడం వారం తర్వాత అదృష్టం కొద్ది అతను బయట పడడం జరిగితే ఆ విలువైన ప్రాణం ఖరీదు చిన్న పొరపాటుగా చెప్తున్నారు.

Read Also : http://Bihar Election: రేపే బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు

accidents

మన రాష్ట్రంలో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సకాలంలో ట్రీట్మెంట్ జరగక ఒక గర్భవతి ప్రాణాలు కోల్పోయింది. ఒరిస్సాలోని ఒక మెడికల్ కాలేజీ హాస్పిట ల్లో తప్పుగా ఇంజక్షన్ ఇచ్చినా కారణంగా ఏడు మంది మృతిచెందారు. మధ్యప్రదేశ్లో కరెంటు స్థంభాన్ని ముట్టుకున్న చిన్నారి కరెంట్షాకుకు గురై మృతిచెందింది. ఈ ప్రమాదాలన్నీ బయటపడ్డవి. దేశవ్యాప్తంగా ఇంకా బయటికి రాని ఇలాం టివి లక్షలు, కోట్లు. ఒక నిర్లక్ష్యం ఎందరి ప్రాణాలు తీసుకున్నా తామరాకు మీద నీటిబొట్టులా తమకు అంటకుండా చూసుకుంటారు అందుకు బాధ్యులు. దీనికి ప్రైవేటు, ప్రభుత్వ, ఏ రంగము మినహాయింపు కాదు. ఇక రోడ్డు ప్రయాణాల్లో అన్ని రకాల వాహన చోదకుల నిర్లక్ష్యం వారి ప్రాణాలతో పాటు మరెందరినో బలితీసుకుంటోంది. ప్రభుత్వాల విధి విధానాలను అమలుపరిచే విద్యుత్తు,నీరు, విద్య, వైద్య రంగాల్లో నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇక న్యాయ వ్యవస్థల్లో నిర్లిప్తతతో ఎంతోమంది నిందలు మోస్తూ తీర్పులకోసం దీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రమాదాలు (accidents)జరిగిన తర్వాత వెంటనే జరిమానాలు, ప్రాణా లు నేలకొరిగిన తర్వాత పారితోషికాలు. లక్షలాది కుటుం బాల ఆరోగ్యాన్ని హరిస్తున్న మద్యపానాన్ని ప్రోత్సహిస్తాం, దాంతో సంభవించే మరణాలన్నిటికీ కాంపల్సేషన్స్ ఇస్తాం అని అంటారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా మన ప్రాణాలకు గ్యారెంటీ లేదు. వేల కోట్ల అప్పు లతో ఇస్తున్న ఉచిత పథకాల్లో నిర్వహణా లోపంపై నిర్లక్ష్య పు నీడ ప్రజలకు పీడగామారింది. పార్టీలు, ప్రతిపక్షాలు, ప్రభుత్వాలు ఒకరి నిర్లక్ష్యాన్ని మరొకరు ఎండగడుతూ నిం దిస్తూనే ఉన్నారు. ప్రతి పనిలో నిర్లక్ష్యం మనిషిని మానవ త్వం లేని శిలగా మారిస్తే, ఇది మానవ జాతి మనుగడకు, దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి.

-జోస్యుల వేణుగోపాల్

ప్రమాదం అంటే ఏమిటి?

ప్రమాదం అంటే హాని కలిగించే సంభావ్యత, ఆపద లేదా విపత్తు అని అర్థం. ఇది ప్రాణ నష్టం, గాయం, ఆస్తి నష్టం లేదా పర్యావరణ క్షీణత వంటి ప్రతికూల ప్రభావాలను కలిగించే ఏదైనా వస్తువు, సంఘటన లేదా పరిస్థితిని సూచిస్తుంది.

ప్రమాదవశాత్తు నష్టం అర్థం?

ప్రమాదవశాత్తు నష్టం అంటే అకస్మాత్తుగా జరిగే భౌతిక నష్టం మరియు ఉద్దేశపూర్వకంగా జరగదు . నష్టాన్ని కలిగించే ఒకే ఒక్క సంఘటన ఉండాలి. ఇది ఇలా ఉండవచ్చు: మీ ఫోన్‌ను ఇంట్లో పడవేయడం మరియు పగలగొట్టడం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

accidents BreakingNews latest news negligence Public Safety road safety Telugu News traffic rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.