News Telugu: Abdul Nazeer: గవర్నర్, డిప్యూటీ సీఎం నేడు పుట్టపర్తికి రాక

Read Time:  1 min
Abdul Nazeer
Abdul Nazeer
FONT SIZE
GET APP

పుట్టపర్తి: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, (pawan kalyan) రాష్ట్ర విద్య, హెచ్ ఆర్ డి, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ లు మంగళవారం పుట్టపర్తి రానున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రాజ్ భవన్ నుండి గవర్నర్ బయలుదేరి అక్కడి నుండి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 :20 గంటలకు పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలియజేశారు. సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రశాంతి నిలయం శ్రీనివాస అతిథి గృహంకు చేరుకొని రాత్రికి అక్కడే బస చేయనున్నట్లు తెలిపారు.

Read also: Latest News: AP: 10th పబ్లిక్‌ పరీక్షల తేదీలు విడుదల?

Abdul Nazeer

Governor and Deputy CM to arrive in Puttaparthi today

19వ తేదీన

అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి 05:20 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారని తెలిపారు. మంత్రి నారా లోకేష్ మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరి ప్రత్యేక పుట్టపర్తి విమానాశ్రయానికి సాయంత్రం 5:20 గంటలకు చేరుకున్నట్లు తెలిపారు. ఆయన పుట్టపర్తి రూరల్ పరిధిలోని కప్పల బండ గ్రామంలో ఏపీఐఐసీ లేఔట్ సందర్శించనున్నట్లు తెలియజేశారు. వీరు 19వ తేదీన ప్రధానమంత్రి పర్యటనలో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.