Telugu News: Aadhaar: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లలోనే ఆధార్ అప్‌డేట్

Read Time:  1 min
Aadhaar
Aadhaar
FONT SIZE
GET APP

పాఠశాలల్లోనే ప్రత్యేక ఆధార్ అప్‌డేట్ క్యాంపులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల ఆధార్(Aadhaar) వివరాలను సులభంగా సరిచేసుకునేందుకు పాఠశాలల్లోనే ప్రత్యేక ఆధార్ అప్‌డేట్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది.

Read Also:  IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

ఈ కార్యక్రమం నవంబర్ 17 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో జరుగనుంది. ఈ సందర్భంగా విద్యార్థుల ఆధార్ వివరాల్లో ఉన్న పొరపాట్లు సరిచేసుకోవడం, బయోమెట్రిక్ సమాచారాన్ని (వేలిముద్రలు, కంటి స్కాన్‌) నవీకరించడం వంటి సేవలు(UIDAI) అందుబాటులో ఉండనున్నాయి.

గుడ్‌ న్యూస్.. పిల్లలకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు

Aadhaar: గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఈ విషయమై అన్ని జిల్లా కలెక్టర్లకు అధికారిక సూచనలు పంపారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలలోనే ఈ అప్‌డేట్ సేవలు పొందేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ పిల్లల ఆధార్ వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని అధికారుల విజ్ఞప్తి. ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.