📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Ambati Rambabu : అంబటి రాంబాబుపై మొత్తం 3 కేసులు నమోదు

Author Icon By Sudheer
Updated: February 1, 2026 • 10:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గుంటూరులో చోటుచేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఆయనపై ఏకకాలంలో మూడు కేసులు నమోదవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, విధుల్లో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం వంటి అభియోగాలపై పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. నిన్నటి ఉద్రిక్తతల అనంతరం అంబటిని పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

HYD : హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!

అంబటిపై నమోదైన మూడు కేసుల వివరాలు పరిశీలిస్తే:

మొదటి కేసు: గుంటూరులోని నల్లపాడు పిఎస్‌లో పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించారన్నది దీని సారాంశం.

రెండవ కేసు: విధుల్లో ఉన్న ఎస్ఐ రామకృష్ణపై దురుసుగా ప్రవర్తించారని అదే స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. రోడ్డుపై కారు పార్కింగ్ విషయంలో అడ్డుకున్నందుకు పోలీసులను నెట్టేయడం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం వంటి సెక్షన్ల కింద ఈ కేసు ఫైల్ చేశారు.

మూడవ కేసు: పల్నాడు జిల్లా నకరికల్లులో టీడీపీ నేత బాజీ ఫిర్యాదుతో నమోదైంది. సోషల్ మీడియా వేదికగా లేదా బహిరంగంగా ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడారన్నది ఫిర్యాదుదారుడి ఆరోపణ.

ఈ పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిని ముట్టడించగా, పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు, ఈ అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా వైసీపీ అభివర్ణిస్తోంది. అంబటి సతీమణి విజయలక్ష్మి ఇప్పటికే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తూ, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వం విమర్శలను తట్టుకోలేక అక్రమ కేసులు పెడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

ambati rambabu Ambati Rambabu Arrest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.