Kailasagiri Trishul Project: విశాఖ పర్యాటకానికి కొత్త శోభ: కైలాసగిరిపై ‘త్రిశూల్’

Read Time:  1 min
Kailasagiri Trishul Project: విశాఖ పర్యాటకానికి కొత్త శోభ: కైలాసగిరిపై 'త్రిశూల్'
Kailasagiri Trishul Project: విశాఖ పర్యాటకానికి కొత్త శోభ: కైలాసగిరిపై 'త్రిశూల్'
FONT SIZE
GET APP

Kailasagiri Trishul Project: పర్యాటక ప్రియుల స్వర్గధామం విశాఖపట్నంలోని కైలాసగిరి మరింత కొత్త హంగులను అద్దుకుంటోంది. ఇప్పటికే గ్లాస్ బ్రిడ్జి, రోప్‌వే, స్కై సైక్లింగ్, జిప్‌లైనర్ వంటి సాహస క్రీడలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న కైలాసగిరిలో, తాజాగా ‘త్రిశూల్’ పేరుతో మరో అద్భుత ఆకర్షణ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈ వినూత్న ప్రాజెక్టును చేపట్టింది.

Read Also: Job Calendar 2026: ఉగాదికి ఏపీ జాబ్ క్యాలెండర్: లోకేశ్

వేగవంతంగా పనులు.. ఉగాది నాటికి ప్రారంభోత్సవం

ఈ పనుల్ని వీఎంఆర్‌డీఏ మరింత వేగవంతం చేసింది. వాస్తవానికి శివరాత్రి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో ఆలస్యమైంది. వచ్చే నెలలో ఉగాది నాటికి ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ త్రిశూల్ ప్రాజెక్ట్ వ్యయం రూ.2.50 కోట్లు కాగా.. ఈ త్రిశూలం 65 అడుగులు ఎత్తు, 30 అడుగుల వెడల్పు, చుట్టు కొలత 3 అడుగులు ఉంది. ఫైబర్‌ రీఇన్‌ ఫోర్స్‌డ్‌ ప్లాస్టిక్‌‌తో దీనిని తయారు చేస్తారు..

A new charm for Visakhapatnam tourism: 'Trishul' on Kailasagiri
A new charm for Visakhapatnam tourism: ‘Trishul’ on Kailasagiri

100 ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ త్రిశూలాన్ని తుఫాన్‌, భూకంపాలను కూడా తట్టుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ త్రిశూలం ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ను ఉపయోగించారు. ఈ త్రిశూలాన్ని ఎంత ఎత్తులో ఎత్తులో నిర్మించాలో అధికారులు పరిశీలించారు. ముందు 55 అడుగులు అనుకున్నారు.. కానీ మరో 10 అడుగులు కలిపి 65 అడుగులకు పెంచారు. ఒక్క ఢమరుకం 10 అడుగుల ఎత్తు.. 18 అడుగుల వెడల్పు ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.