📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Vidadala Rajini:ఆరోగ్యశ్రీని నాశనం చేసే కుట్ర జరుగుతోంది : విడదల రజిని

Author Icon By Anusha
Updated: October 11, 2025 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవ్వడం వల్ల పేద ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందని వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu) నాయకత్వంలోని ప్రభుత్వానికి సంబంధించిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం, పేదలకు సంజీవని అవ్వాల్సిన స్థితిలో, నిత్యజీవితంలో సమస్యగా మారిపోతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Rayapati Sailaja: స్త్రీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్

వైద్య వ్యవస్థలో ఏర్పడిన ఈ సంక్షోభం సామాన్య ప్రజలకు మాత్రమే కాకుండా, ఆసుపత్రుల యాజమాన్యాలకు, వైద్యులతో సహా మొత్తం ఆరోగ్య రంగానికి కష్టాలు సృష్టిస్తోంది.వైద్య వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు.ప్రభుత్వం నెట్‌వర్క్ ఆసుపత్రులకు సుమారు 3 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని విడదల రజిని (Vidadala Rajini)తెలిపారు.

బకాయిల కోసం ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన లేదని అన్నారు. దీంతో చేసేదేమీ లేక నెట్‌వర్క్ ఆసుపత్రులు (Network hospitals) సేవలను నిలిపివేసి, బోర్డులు తిప్పేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వైద్య సేవలు (Medical services) నిలిచిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు.

Vidadala Rajini

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో

పీహెచ్‌సీ డాక్టర్లు, నెట్‌వర్క్ డాక్టర్లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం దారుణమని మండిపడ్డారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని 1,059 వ్యాధుల నుంచి 3,257కి పెంచామని, నెట్‌వర్క్ ఆసుపత్రులను 900 నుంచి 2,300కి విస్తరించామని రజిని గుర్తుచేశారు. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య ఆసరా వంటి పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం మాత్రం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) తెచ్చిన ఆరోగ్యశ్రీని చంపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని రజిని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తమ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారని మండిపడ్డారు.

గత ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే పనుల్లో ప్రభుత్వం బిజీగా ఉందని ఆరోపించారు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన ఆమె, ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh latest news Telugu News Vidadala Rajini

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.