ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ (Andhra Pradesh State School Education Department) తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు మొత్తం 83 సెలవులు ఉండనున్నాయి. మొత్తం 233 పాఠశాల పని దినాలు ఉండగా, వీటిలో ప్రాముఖ్యమైన పండుగలకు సంబంధించిన సెలవులు కూడా ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ముందుగానే వీటిని గమనించుకోవాల్సిన అవసరం ఉంది.
దసరా, సంక్రాంతి ముఖ్య సెలవులు
సాధారణ పాఠశాలలకు దసరా సెలవులు (Holidays) సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఇవ్వనున్నారు. అలాగే సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు కొనసాగుతాయి. వేసవి వేడి దృష్ట్యా మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ చర్యలన్నీ విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
మైనారిటీ స్కూళ్లకు ప్రత్యేక సెలవులు
మైనారిటీ పాఠశాలలకు మాత్రం కొన్ని సెలవుల్లో భిన్నతా ఉంటుంది. దసరా సెలవులు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 21 నుంచి 28 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 15 వరకు ఉంటాయి. ఆయా మతపరమైన వేడుకల నేపథ్యంలో ప్రత్యేక సెలవులు ఇవ్వడం జరుగుతోంది. విద్యా కార్యదర్శుల సూచనల మేరకు అన్ని పాఠశాలలు ఈ షెడ్యూల్‌ను పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Read Also : Telangana New Ministers: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు