📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

APSRTC : మ‌హిళ‌ల ఉచిత బ‌స్సు ప్ర‌యాణానికి 74 శాతం బ‌స్సులు: ఆర్‌టీసీ ఎండీ

Author Icon By Divya Vani M
Updated: July 29, 2025 • 7:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆగస్టు 15 నుంచి ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు (Free bus for women) ప్రయాణాన్ని అమలు చేయనుంది. ఈ నిర్ణయం కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.ఆర్‌టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు (RTC MD Dwaraka Tirumala Rao) ఈ పథకంపై తాజా వివరాలు వెల్లడించారు. ఆయన తిరుపతి జిల్లా వెంకటగిరి, వాకాడు బస్టాండ్లు, డిపోలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.వచ్చే నెల నుంచి మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. అందుకోసం 11 వేల బస్సుల్లో 74 శాతం బస్సులను ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్టు తెలిపారు.

APSRTC : మ‌హిళ‌ల ఉచిత బ‌స్సు ప్ర‌యాణానికి 74 శాతం బ‌స్సులు: ఆర్‌టీసీ ఎండీ

ఉమ్మడి జిల్లాలకు విస్తరణ

ఈ పథకాన్ని ప్రస్తుత జిల్లాలకు మాత్రమే కాకుండా ఉమ్మడి జిల్లాలకు కూడా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.రాబోయే రెండు నెలల్లో ప్రతి బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.ఆర్‌టీసీలోని అన్ని ర్యాంకుల ఉద్యోగులకు వచ్చే నెలాఖరులోగా పదోన్నతులు కల్పించనున్నట్టు ద్వారక తిరుమలరావు తెలిపారు.

కొత్త బస్సుల కేటాయింపు

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టీసీ డిపోలకు 1350 కొత్త బస్సులను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 750 బస్సులు మంజూరు కాగా, మరో 600 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి అధికారులు పకడ్బందీగా పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

Read Also : Chevireddy Bhaskar Reddy : చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు

Andhra Pradesh coalition government scheme Free bus for AP women RTC free travel women's bus is free

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.