Drought zones : ఏపీలో 51 కరువు మండలాలు గుర్తింపు

Read Time:  1 min
51 drought zones identified in AP
51 drought zones identified in AP
FONT SIZE
GET APP

Drought zones: ఏపీలోని 51 కరువు మండలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తీవ్ర ఎండలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కరువు మండలాలను గుర్తించాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది. ఆయా మండలాల్లో పర్యటించిన అధికారులు కరువు పరిస్థితులను అధ్యయనం చేశారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 51 మండలాల్లో కరువు ఉన్నట్లు అంచనా వేశారు. సాంకేతికత ఆధారంగా కరువు మండలాలపై కలెక్టర్లు నివేదికలు తయారు చేశారు. అనంతరం ప్రభుత్వానికి అందజేశారు. దీంతో కరువు మండలాలపై ప్రభుత్వం త్వరలోనే జాబితాను విడుదల చేయనుంది.

ఏపీలో 51 కరువు మండలాలు

మొత్తం 51 మండలాల్లో కరువు పరిస్థితులు

కాగా, ఈ సంవత్సరం రబీలో లోటు వర్షపాతం నమోదు అయింది. సరైన సమయంలో వర్షాలు పడలేదు. పంటల దిగుబడులు సైతం చాలా తగ్గిపోయాయి. రబీ సీజన్ ముగిసిన నేపథ్యంలో కరువు పరిస్థితులపై అధికారులను ప్రభుత్వం నివేదికలు కోరింది. పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి, వర్షపాతం నమోదు, భూమిలో తేమశాతం, భూగర్భజలాల పరిస్థితి వంటి కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా కరువు మండలాలను అధికారులు ఎంపిక చేశారు. మొత్తం 51 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నట్లు నివేదికలు రెడీ చేసి ప్రభుత్వానికి అందజేశారు. దీంతో కరువు మండలాలపై ప్రభుత్వం త్వరలోనే జాబితాను విడుదల చేయనుంది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.