📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Atchannaidu: అన్నదాత అభివృద్ధికి 5 సూత్రాలు : మంత్రి అచ్చెన్నాయుడు

Author Icon By Tejaswini Y
Updated: November 25, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం పటిష్టమైన పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళుతోందని వ్యవ సాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Atchannaidu) స్పష్టం చేశారు. సోమవారం కృష్ణ జిల్లా, ఆవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల గ్రామంలో ..రైతన్న మీకోసం.. కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మండలి బుద్ధప్రసాద్ కలసిప్రారంభించారు. ఈసందర్భంగా ఘంట సాల గ్రామంలో రైతులకు పంచసూత్ర ప్రణాళిక ఉద్దేశాన్ని, ఉపయోగాలను మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ముఖ్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, ఆగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్(Food processing), ప్రభుత్వాల మద్దతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని చేపట్టామన్నారు. వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకురావడం ద్వారా రైతుల సాగును లాభసాటి చేసేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 29వరకూ “రైతన్నా మీకోసం” పేరుతో కార్యక్రమాలు చేపడతున్నామని, డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు నిర్వహిస్తామని తెలిపారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా రైతు నిలబడేలా, వ్యవసాయం కొనసాగించేలా ఒక వ్యవస్థ ఉండాలి. రైతుకి భరోసా ఇవ్వగల శాశ్వత పరిష్కారాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువస్తున్నారు. ఆ నిర్ణయమే రైతన్న మీకోసం కార్యక్రమం అని పేర్కొన్నారు.

Read Also: Ibomma: రవి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందాలి..

రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందాలని ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండటంతో, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. రైతు బలపడితేనే గ్రామం బలపడుతుంది. గ్రామం బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది. అందుకే ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లడం మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని తెలిపారు. రైతు ఆదాయం పెంపు, ఇన్పుట్ వ్యయాల తగ్గింపు, పంటలకు హామీ ధర, ప్రకృతి విపత్తుల్లో రక్షణ, మార్కెట్ స్థిరీకరణ, శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. అందుబాటు లోన్లు, పంట బీమా, నీటి వనరుల మెరుగుదల, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, రైతు సేవా కేంద్రాల బలపరచడం వంటి చర్యలు రైతు(farmer) కుటుంబాల అభివృద్ధి వైపు స్పష్టమైన అడుగులని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు స్వయం సమృద్ధి సాధించే పరిస్థితులను క్రమబద్ధంగా సృష్టిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి రైతు ఇంటికి వెళ్లి పంచసూత్రాలను కనీసం 20 నిమిషాలపాటు వివరించేందుకు పెద్దస్థాయి కార్యక్రమం చేపట్టామని మంత్రి వెల్లడించారు. ఈ పంచసూత్రాలు ఏమిటి? రైతుకి ఎలా మేలు జరుగుతుంది? భవిష్యత్తులో ఎలా స్థిర ఆదాయం వస్తుంది? ఏ ఇబ్బందులు లేకుండా వ్యవసాయం ఎలా ముందుకు సాగుతుంది? అనే విషయాలు ప్రతి రైతుకు స్పష్టంగా చెప్పడం మా లక్ష్యమని తెలిపారు. నీటి(water) పారుదల, రైతు అభివృద్ధికి మొదటి అస్త్రం అని, వ్యవసాయం చేయాలంటే ముందుగా నీరు అవసరం. నీరు లేకపోతే రైతు కష్టమే. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నారని వివరించారు.

5 principles for the development of the food security sector: Minister Atchannaidu

యాంత్రికరణ అగ్రిటెక్ రైతు భవిష్యత్ ఆయుధం.

వ్యవసాయంలో కూలీల ఖర్చులు పెరుగుతున్నాయని, అందుకే యాంత్రికరణ తప్పనిసరి అని మంత్రి అన్నారు. ఒకప్పుడు ట్రాక్టర్ కనిపించినా ఆశ్చర్యపోయేవాళ్లం, ఇప్పుడు ప్రతి గ్రామంలో యాంత్రికరణే ఆధారం, కోత నుండి మోత వరకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతు సేవ కేంద్రాలలో అన్ని యాంత్రికరణ పరికరాలు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, రైతులు దీనిని వినియోగిస్తేనే లాభాలు ఎక్కువగా వస్తాయని అన్నారు. పంట పండిస్తే సరిపోదు. స్థానికంగా ఫుడ్ ప్రాసెసింగ్(processing) పరిశ్రమలు ఉంటేనే రైతుకి అసలు లాభం వస్తుందని మంత్రి చెప్పారు. అధిక దిగుబడులు వచ్చినా ధరలు రాక రైతులకి జరిగిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అండగా నిలిచిందని, బడ్జెట్లో 300 కోట్లు పెట్టినా, అవసరాన్ని బట్టి దాదాపు 1000 కోట్లు ఖర్చు చేసి రైతు పంటలు కొనుగోలు చేసామన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. వ్యవసాయ శాఖ అభివృద్ధిపై జగన్ ఓపెన్ డిబేట్కు రావాలని, లేదా అసెంబ్లీకి వస్తే చర్చించుకుందామని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

https://vaartha.com/andhra-pradesh/vizianagaram-crime-accused-gets-12-years-in-prison-in-rape-case/590273/

Agriculture Development Andhrapradesh politics annadata abhivrudhi AP minister speech Atchannaidu Farmers Welfare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.