📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

PRC: ఆప్కో ఉద్యోగులకు 2022 పిఆర్సీ అమలు

Author Icon By Sharanya
Updated: June 27, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

-సంస్థ ఉన్నతికి విస్త్రృత కార్యాచరణ :ఆర్ పి సిసోడియా

విజయవాడ: ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఆప్కో ఉద్యోగుల (Apco employees) కు సైతం 2022 పిఆర్సి (PRC) ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ లూమ్స్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ కార్యవర్గం నిర్ణయించింది. బుధవారం విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో సంస్థ ఛైర్మన్, చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది.

ఆప్కో ఉద్యోగులకు పిఆర్సి అమలు

చేనేత కార్మికుల అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపై లోతుగా చర్చించిన పాలకమండలి కీలక అంశాలను అమోదించింది. ప్రధానంగా గత ప్రభుత్వ హాయాంలో ఆప్కో ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయకుండా కాలయాపన చేయగా, ప్రస్తుత బోర్డు ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, ఇప్పటి నుండి పెరిగిన జీతాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ అప్కో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నప్పటికీ, సంస్థ ఉన్నతికి ఒక పక్క ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తూ, మరోవైపు ఉద్యోగుల అంకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించామన్నారు. ఈ నిర్ణయం వల్ల అప్కో శాశ్వత ఉద్యోగులు లబ్ది పొందుతారన్నారు. మరోవైపు ఉద్యోగుల సంపాదిత సెలవులో ప్రతి సంవత్సరం 15 రోజులు సెలవును నగదుగా మార్చుకునేందుకు సైతం పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు.

ఆప్కో ఉన్నతికి సంబంధించి పలు నిర్ణ యాలను సైతం పాలక మండలి ఆమోదించిందని సంస్థ నిర్వహణా సంచా లకులు విశ్వ మనోహరన్ తెలిపారు. ఆప్కో పై ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ నిర్వహించిన అధ్యయనం నివేదికను పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించా మన్నారు. సొసైటీ లకు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని నిర్ణయించామన్నారు.వి. శ్వవ్యాప్త విక్రయాలను ప్రోత్సహించేలా ఆప్కో వెబ్ సైట్ ను ఆధునీకరించనున్నామని విశ్వ మనోహరన్ తెలిపారు. అప్కో, లేపాక్షి సంస్థల ఉత్పత్తులు రెండు సంస్థల షోరూమ్ లలో ఉండేలా జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా అధ్యక్షతన జరిగిన ఆప్కో పాలక మండలి సమావేశం తీసుకున్న నిర్ణయాన్ని పాలకమండలి స్వాగతించిందన్నారు. చేనేత, జౌళి శాఖ కమీషనర్ జి. రేఖారాణి మాట్లాడుతూ చేనేత కార్మికులకు మెరుగైన వేతనాలు లభించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సమావేశంలో పాలకమండలి డైరెక్టర్లుగా ఉన్న నాబార్డు ఎజిఎం మిలింద్ చౌసల్కర్, ఆప్కాబ్ సిజిఎం నర్రా వెంకటరత్నం, ఎన్ సిడిసి ప్రాంతీయ సంచాలకులు స్నేహాన్లు గోస్వామి, ఆన్ లైన్ విధానంలో పరిశ్రమల శాఖ ఉప కార్యదర్శి నేతల వీర విజయ కుమారి పాల్గొన్నారు. ఆప్కో జిఎం నాగేశ్వరరావు, ఎజిఎంలు హరికృష్ణ, బేనహర్, సాయిబాబు, ఎఓ శ్రీనివాసరావు సమావేశంలో ఉన్నారు.

Read also: AP CM : నేడు 3 జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

AP Liquor Scam: లిక్కర్ కేసు నిందితులకు నార్కో టెస్ట్?

#2022PRC #APCOEmployees #APGovernment #APNews #EmployeeBenefits #EmployeeWelfare #GovernmentDecision #PRCImplementation #PublicSector #SalaryRevision Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.