📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP – ఏపీలో అదనంగా 185 వైద్యసేవలు

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 10:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మిశ్రమ(హైబ్రిడ్) విధానంలో అందరికీ ఆరోగ్య బీమా పథకం అమల్లో ప్రభుత్వాసుపత్రుల పాత్రను పెంచారు. ఈ దిశగా 155 రకాల వైద్యసేవలను ప్రభుత్వాసుపత్రులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీంతో ప్రభుత్వాసుపత్రులకు ప్రస్తుతం రిజర్వ్ చేసిన 169 రకాల సేవలతో నూతన విధానంలో మొత్తం 324 రకాల వైద్యసేవలను ప్రభుత్వాసుపత్రుల ద్వారా ప్రజలకు లభిస్తాయి.

ఈ మేరకు జిల్లా కలెక్టర్లుల సదస్సులో ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) తెలిపారు. ప్రస్తుతం డా.యన్.టి.ఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా అందించబడుతూ అత్యంత అరుదుగా లబ్దిదారులు వాడుకుంటున్న 197 రకాల వైద్యసేవలకు ట్రస్టు ద్వారా ఉచితంగా సేవలందించబడతాయి.

ప్యాకేజీ విలువ కలిగిన పలురకాల వైద్యసేవలను

ప్రస్తుతం డా.యన్.టి.ఆర్ వైద్యసేవ (Dr. NTR Medical Services) కింద లబ్దిదారులకు ఉచితంగా అందించబడుతున్న వైద్యసేవలు, కొత్త మిశ్రమ(హైబ్రిడ్) విధానం కింద వాటిని క్రమబద్ధీకరించిన వైనాన్ని వైద్యారోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ సమీక్షించారు. ఆరోగ్య శ్రీ కింద ప్రజలకు అందించబడే వైద్యసేవలను పెంచిచూపటానికి,

చికిత్సలో సారూప్యతతో పాటు ఒకేరకం ప్యాకేజీ విలువ కలిగిన పలురకాల వైద్యసేవలను విడివిడిగా చూపటంతో మొత్తం సేవల సంఖ్య 3,257 కు పెరిగినట్లు అధికారులు వివరించారు. అటువంటి సారూప్యత కలిగిన సేవలను వివిధ విస్తృత కేటగిరీలుగా వర్గీకరించటంతో సేవల సంఖ్య 186 మేరకు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

సేవలుగా క్రమబద్ధీకరించినట్లు అధికారులు వెల్లడించారు

ప్రభుత్వాసుపత్రులకు కేటాయించిన 324 సేవలు, అరుదుగా వాడుకోబడుతున్న 197 సేవలు మినహాయించగా,మిగిలిన 2,736 సేవలను 2,550 సేవలుగా క్రమబద్ధీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ 2,550 సేవలకు నూతన పథకం అమలుకు ఎంపిక కానున్న ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లింపులు జరుగుతాయి.

ఈ రీతిన ప్రస్తుతం ప్రజలకు అందించబడుతున్న 3,257 వైద్య సేవలను నూతన బీమా పథకం (Insurance Scheme) లో లబ్దిదారులకు అందిస్తామని మంత్రి సత్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పథకంలో అందించబడిన వైద్య సేవల సంఖ్యను ఎక్కువగా చేసి చూపటానికి గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని వైద్యులు మంత్రికి వివరించారు. డెంగీ, టైఫాయిడ్, పారా టైఫాయిడ్ జ్వరాల చికిత్స విధానం, ప్యాకేజీ విలువలు ఒకటే అయినా గత ప్రభుత్వం వాటిని విడివిడిగా చూపించింది. దీనికి బదులుగా వాటిని జ్వరాలు అన్న కేటగిరీలో చేర్చడం జరిగింది.

AP

నూతన పథకం క్రింద ప్రభుత్వాసుపత్రులకు

అదే రీతిన గుండెకు సంబంధించిన రైట్ హార్ట్ కేథటరైజేషన్, లెఫ్ట్ హార్ట్ కేథటరైజేషను (స్టెంట్
వేయడం) ఒకే కేటగిరీ కింద నూతన బీమా పథకంలో చేపడతారు. ఈ విధంగా సారూప్యత కలిగిన 319 రకాల వైద్యసేవలను 133 రకాలుగా వర్గీకరించారు. ఉన్నత వైద్యుల బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేసి నూతన వర్గీకరణను సూచించింది.

వివిధ ప్రభుత్వాసుపత్రులల్లో ఏర్పాటు చేయబడిన మోలిక సదుపాయాలు, అందుబాటులో ఉన్న వైద్యసిబ్బందిని దృష్టిలో పెట్టుకుని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే దిశగా 155 రకాల వైద్యసేవలను (Medical services) అదనంగా నూతన పథకం క్రింద ప్రభుత్వాసుపత్రులకు కేటాయించడం జరిగింది. ఎక్కువ సంఖ్యలో జరిగే గర్భాశయ తొలగింపు, ఎపెండిక్స్ తొలగింపు, ఇ.యన్.టి సేవలను ఈ కేటగిరీలో చేర్చారు.

మిశ్రమ విధానంలో

అత్యంత అరుదుగా అవలంబించే థైమస్ గ్లాండ్ తొలగింపు, చిన్నప్రేగు మొదటి భాగం (డియోడినమ్) తొలగింపు వంటి 197 రకాల వైద్యసేవలక డా.యన్.టి.ఆర్ ట్రస్టు ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మిశ్రమ విధానంలో అందరికీ ఆరోగ్య బీమా పథకం కింద రాష్ట్రంలో 1.63 కోట్ల లబ్ధిదా రుల కుటుంబాలకు సంవత్సరానికి రూ.2.5 లక్షల మేరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా కల్పిస్తారు.

ఇందులో మొదటిసారిగా పేదరిక రేఖ (Poverty line)కు పైనవున్న 20 లక్షల ఏ.పి. యల్ కుటుంబాలకు కూడా ఆరోగ్య బీమా లభిస్తుంది. ఉద్యోగస్తులకు, పాత్రికేయులకు ప్రత్యేక ఆరోగ్యసేవల పథకాలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం డా.యన్.టి.ఆర్ వైద్యసేవ కింద ఉచితంగా వైద్యం పొందుతున్న 1.43కోట్ల కుటుంబాలకు రూ.2.5 లక్షలు దాటి రూ.25 లక్షల వరకు అయ్యే ఖర్చును డా. ఎన్టి.ఆర్.వైద్య ట్రస్టు ద్వారా ప్రభుత్వమే భరిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-liquor-scam-another-supplementary-chargesheet-in-the-liquor-scam/andhra-pradesh/548033/

additional 155 medical services Breaking News hybrid health insurance scheme latest news public hospitals role state government Telugu News Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.