ఆంధ్రప్రదేశ్లో పది తరగతి విద్యార్థుల కోసం రూపొం దించిన శతదిన చర్యా ప్రణాళిక (The 100-day action plan) విద్యా వ్యవస్థలో పెద్ద చర్చకు దారితీస్తోంది. సాధారణ పాఠశాల తరగతులు ముగిసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహించడం, వెంటనే పత్రాలు సరిదిద్దడం, అదే రోజు నమోదులు పూర్తి చేయ డం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ శతదిన చర్యా ప్రణాళిక (The 100-day action plan) విధానం ఎంతవరకు విద్యార్థుల అభివృద్ధికి మేలు చేస్తుందన్న దానిపై అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలు రోజంతా తరగతుల్లో చదివి అలసిపోయిన సమయమే పరీక్ష సమయం కావడం వారి ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకా రం పిల్లల్లో ఏకాగ్రత ఒక స్థాయికి మించి కొనసాగదు. రోజంతా పాఠాలు విని, హోంవర్క్ పూర్తి చేసి చివర్లో పరీక్ష రాయడం శారీరకంగా కూడా కష్టమే కాక మానసికంగా మరింత ఒత్తిడి కలిగిస్తుంది. ఈ విధానం పిల్లల్లో చదువుపై భయాన్ని పెంచుతుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపి స్తోంది. పాఠశాల అంటే నేర్చుకునే స్థలం అని కాకుండా, పరీక్షలు పెట్టే కేంద్రం అని భావించే ప్రమాదం ఉంది. పరీ క్షల కంటే నేర్పు ముఖ్యమని తెలియజేయాల్సిన సమయం లో, పరీక్షలను మరింత కఠినంగా చేయడం పెద్ద లోపం.
Read Also: TTD: మెనూ లో ఇకపై అన్నప్రసాదాల తయారీ
ఉపాధ్యాయులపై పనిభారం
ఉపాధ్యాయులపై పడుతున్న పనిభారం రోజురోజుకు పెరు గుతోంది. బోధన పూర్తయ్యాక పరీక్ష నిర్వహణ, పేపర్ కరెక్షన్, వెంటనే ఆన్లైన్లో నమోదు, తదుపరి రోజు పాఠాల ఏర్పాట్లు ఇలా నిరంతరంగా కొనసాగుతున్న పనిలో ఉపా ధ్యాయులకు విశ్రాంతి అనే భావన లేకుండాపోతోంది. ఇది బోధన నాణ్యతను తగ్గించడమే కాకుండా, ఉపాధ్యాయుడు చూపే మానవత్వాన్ని కూడా అలసట కారణంగా తగ్గిస్తోంది. ఆరు నుంచి తొమ్మిది తరగతుల పిల్లలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఉపాధ్యాయులు మొత్తం సమయాన్ని పది తరగతి పనులకు కేటాయించడంతో మిగతా తరగతులకు సరైన బోధన అందడం లేదు. టైం టేబుల్ మార్పులు, తరగతుల రద్దు, పాఠ్యాంశాలలో ఖాళీలు ఏర్పడి మధ్య తరగతుల విద్యార్థులు నష్టాన్ని భరించాల్సి వస్తోంది. ఇదంతా జరుగుతున్నప్పటికీ, విద్యార్థుల ఆరోగ్యం అనే ముఖ్య అంశం పూర్తిగా మరచిపోయినట్టే కనిపిస్తోంది. రోజూ ఒకే రకమైన ఒత్తిడితో ఉన్నపుడు పిల్లలలో శారీరక అలసట, తలనొప్పి, నిద్రలోపం, ఆందోళన వంటి సమస్య లు రావచ్చు. ఇది పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యానికి హానికరం. పిల్లల కుటుంబాలు కూడా ఆందోళనలో ఉంటున్నాయి. సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాతే పిల్లలు ఇంటికి చేరడం భోజనం, విశ్రాంతి, ఆటపాటలకు అవుతున్న అంత రాల వల్ల పిల్లల వ్యక్తిత్వవికాసం ప్రభావితమ వుతోంది. తల్లి దండ్రులు చదువు కోసం పిల్లలు ఇంత శ్రమపడటం చూసి మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉపాధ్యాయుల కుటుం బాలకు కూడా ఇదే సమస్య. వారు ఇంటికి చేరేసరికి అల సటతో శక్తి లేకుండా పోతున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం, పిల్లలతో గడపాల్సిన సమయం, వారి వ్యక్తిగత అవసరాలు అన్నీ తగ్గిపోతున్నాయి. ఇలా సాగితే ఉపాధ్యాయుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రభు త్వ సెలవు దినాల్లో కూడా కార్యక్రమాలు నిరవధికంగా కొన సాగించడం విద్యార్థులు, ఉపాధ్యాయులను పూర్తిగా శ్రమ లోకి నెట్టేస్తోంది. సెలవు అనే మాటకు అర్థం లేకుండాపో తుంది. సెలవు విశ్రాంతికి, పండగలు ఆనందానికి, కుటుం బంతో గడపడానికి ఉపయోగపడాలి.
విరామం కూడా అవసరం
నేర్చుకునే ప్రక్రియకు విరామం కూడా అవసరం. విరామం లేకుండా చదువు కొన సాగితే నేర్చుకునే ప్రక్రియ మందగిస్తుంది. మనోవిజ్ఞాన శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే పిల్లల అభ్యాసం క్రమ పద్ధతిలో, శారీరకంగా మానసికంగా అనుకూల వాతావర ణంలో సాగాలి. ఒత్తిడిలో నేర్చుకున్న పాఠాలు ఎక్కువకాలం నిలబడవు. శాంతమైన వాతావరణంలో నేర్చుకున్నవి మాత్రమే స్థిరంగా నిలుస్తాయి. ప్రస్తుత విధానం ఈ సూత్రా లకు అనుగుణంగా లేదు. తరచుగా పరీక్షలు పెట్టడం పిల్లల ప్రతిభను కొలిచే సరైన మార్గం కాదు. పరీక్షల ద్వారా సాధన పరచడం మంచిదే కానీ, పరీక్షలే చదువు లక్ష్యం కావడం తప్పుడు పద్దతి. పిల్లలు నేర్చుకోవాలి అంటే ప్రశ్నించే గుణం, ఆలోచించే శక్తి, సృజనాత్మకత పెంపొందాలి. ఇవి నిరంతర ఒత్తిడిలో ఎదగవు. ఉపాధ్యాయులు అభిప్రా యాలను వినకుండా తీసుకునే నిర్ణయాలు జరగడం కూడా సమస్య. తరగతి గదుల్లో జరిగే వాస్తవ పరిస్థితులను బాగా తెలిసిన వారు ఉపాధ్యాయులే. వారితో సమాలోచన చేయ కుండా ఈ విధానాలు అమలు చేయడం వల్ల అనేక సమ స్యలు ఏర్పడుతున్నాయి. చదువు, పాఠాలు, పరీక్షలు అన్నీ సమతుల్యంలో ఉండాలి. అధిక ఒత్తిడి ఉన్నపుడు పిల్లలు సాధించే ఫలితాలు తక్కువగా ఉంటాయి. శ్రమ తప్పకుండా అవసరం కానీ, శ్రమ విశ్రాంతి రెండూ సమానంగా ఉండాలి.
విద్యా విధానాలపై సమాలోచన
పాఠశాల అనేది పిల్లల ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రదేశం. అక్కడ వారు ఆటలు నేర్చుకోవాలి, స్నేహాలు పెంచుకోవాలి, సమతుల్యమైన వ్యక్తిత్వం తయారవ్వాలి. మరీ కఠిన షెడ్యూల్ వాటన్నింటిని అడ్డుకుంటోంది. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేస్తోంది అన్న అభిమతం ఉన్నా, పిల్లల వయస్సుకు, వారి మానసిక స్థితికి అనుగు ణంగా ఉండాలి. పాలనలో ప్రధాన లక్ష్యం ఒత్తిడి తగ్గించి, నేర్పు పెంచే దిశగా ఉండాలి. పరీక్షల కోసం పిల్లలను సిద్ధం చేయడం మంచిది కానీ, పిల్లల ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబాలతో గడపాల్సిన విలువైన సమయాన్ని త్యాగం చేస్తూ ఈ రీతిలో కార్యక్రమాలు నిర్వహించడం సమంజసం కాదు. విద్య ఒక సహజ ప్రక్రియ. సహజ మార్గంలోనే వికసిస్తుంది. చివరగా చెప్పాల్సినది ఏమిటంటే విద్య ఒక బలమైన భవిష్యత్తును నిర్మించే సాధనం. అది ఒత్తిడితో కాకుండా ఆత్మవిశ్వాసంతో వికసించాలి. పిల్లల బలహీన తలను గుర్తించి బలాలుగా మార్చడం నిజమైన విద్య. కానీ ఈ ప్రస్తుత విధానం ఆ దిశగా తీసుకెళ్లడం లేదు. అందుకే ఈ సమయంలో ప్రభుత్వం, విద్యా అధికారులు, ఉపాధ్యా యులు, తల్లిదండ్రులు కలిసి విద్యా విధానాలపై మళ్లీ సమాలోచన చేయాలి. పిల్లలకు సంతోషం, ఉపాధ్యాయులకు గౌరవం, కుటుంబాలకు సమతుల్యం కలిగిన విధా నాలు మాత్రమే దేశ భవిష్యత్తును బలపరుస్తాయి.
– తరిగోపుల నారాయణస్వామి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: