వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఆయన పులివెందులలో పర్యటించబోతున్నారు. జగన్ పులివెందుల షెడ్యూల్ ను వైసీపీ ప్రకటించింది.
క్రిస్మస్ వేడుకల్లో జగన్
క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొనేందుకు వెళుతున్నారు. జగన్ రేపు (డిసెంబరు 24) పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీన సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం తాతిరెడ్డిపల్లిలో ఓ కార్యక్రమానికి హాజరవుతారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27వ తేదీన పులివెందులలో ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం పులివెందుల పర్యటన ముగించుకుని తిరుగుపయనం అవుతారు.
పులివెందులలో జగన్ పర్యటన
By
Vanipushpa
Updated: December 23, 2024 • 3:18 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.