📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

తెలుగు మాట్లాడని వారికి ఓటేయొద్దు: వెంకయ్యనాయుడు

Author Icon By Vanipushpa
Updated: January 8, 2025 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు భాష కమ్మదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మన భాషను మనమే నిర్లక్ష్యం చేస్తున్నాము అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగులో మాట్లాడని వారికి ఓటేయొద్దని, తెలుగులో పాలించని ప్రభుత్వాలను ఇంటికి సాగనంపాలని కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్‌ వర్సిటీ వేదికగా జరుగుతున్న రెండవ ప్రపంచ మహాసభల్లో ఆయన మాట్లాడారు.


తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. తెలుగు కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు సంబంధించినదే కాదని పేర్కొన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగాలని, సినిమా సంబషణలు తెలుగులో ఉండాలని అన్నారు. ఆంగ్లంలో మాట్లాడకపోతే నామోషీ అన్న భావన సరికాదని పేర్కొన్నారు.

అమ్మ భాషను మరిచిపోతే అమ్మను కూడా మరిచిపోయినట్టేనని తెలిపారు. ఇంగ్లిష్‌ భాష వాడుతూ తెలుగు భాషను దిగజారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చి తెలుగు మాట్లాడుతున్నారని, మన భాషను మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నామని ప్రశ్నించారు.

telugu language Venkaiah Naidu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.