బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలహీనపడింది. ఇది గురువారం సాయంత్రానికి మరింత బలహీనపడి తర్వాత వాతావరణంలో మార్పులు మరిన్ని తెచ్చే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం, విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వివరించారు. నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు వర్షం పడనున్నాయి. నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా మారి దిశ మార్చుకుందని వివరించారు. మొన్న పశ్చిమ నైరుతి దిశలో పయనించిన ఈ తీవ్ర అల్పపీడనం తరువాత వాయువ్యంగా దిశ మార్చుకుని పయనిస్తోందని చెప్పారు.
గురువారం నాటికి వాయువ్యంగా పయనిస్తుందని తెలిపారు. ఇది పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో అల్పపీడనంగా మరింత బలహీనపడుతుందని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని అధికారులు చెప్పారు.
ఈ జిల్లాల్లో వర్షాలు
By
Vanipushpa
Updated: December 26, 2024 • 12:53 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.