हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి

Anusha
Andhra Pradesh: జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26కి విభజించిన తర్వాత, కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా మండలాల సరిహద్దులు, గ్రామాల చేర్పులు, జిల్లాల పేర్ల మార్పులపై ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకుని చర్యలు ప్రారంభించింది.ఈ నేపథ్యంలో కొత్తగా ఏడుగురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం (Cabinet Sub-Committee) ని ప్రభుత్వం నియమించింది. ఈ ఉపసంఘం పునర్విభజన అంశంపై ప్రజల అభిప్రాయాలను సేకరించి, సమగ్రమైన నివేదికను రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించనుంది. ఇందులో పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధిలో సమతుల్యత, భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, ప్రజల అవసరాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచి నివేదిక సిద్ధం చేయనున్నారు.శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో కలపాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు.

నియోజకవర్గాల పరిధి మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని

గత ప్రభుత్వ హయాంలోనే తమకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు 2024 సమయంలో శృంగవరకుకోట నియోజకవర్గాన్ని తిరిగి విశాఖలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు దాన్ని నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో కలిస్తే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని శృంగవరపుకోట ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.గతంలో అనగా మూడు సంవత్సరాల క్రితం, అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, 2022లో జిల్లాలను పునర్విభజించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి మేరకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో శృంగవరపుకోటను విశాఖ జిల్లాలో కలుపుతారని జనాలు భావించారు. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. దీంతో శృంగవరపుకోట విజయనగరం జిల్లాలోనే ఉంచారు. ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.ఈక్రమంలో తాము అధికారంలోకి వస్తే శృంగవరపుకోటను విశాఖలో కలుపుతామని 2024 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Andhra Pradesh: జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి
Andhra Pradesh: జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి

సిమెంటు పరిశ్రమ

ఇప్పుడు తాజాగా ఉపసంఘం వేయడంతో తమను విశాఖలో కలపాలని శృంగవరపుకోట వాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి. త్వరలో కొత్తవలసలో సిమెంటు పరిశ్రమ కూడా రాబోతోంది. ఇండస్ట్రీయల్‌ పార్కులు, ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పైగా కొత్తగా నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయం కూడా దీనికి దగ్గరలోనే ఉంది. దీంతో శృంగవరపుకోటను విశాఖ జిల్లాలో కలిపితే మరింత అభివృద్ధి జరుగుతుందని ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారు.వాస్తవానికి కొన్నాళ్ల క్రితం వరకు అనగా విజయనగరం జిల్లా ఏర్పడక ముందు శృంగవరపుకోట విశాఖపట్నం జిల్లాలోనే ఉండేది. అయితే 1971లో విశాఖలోని కొన్ని ప్రాంతాలను.. అలానే శ్రీకాకుళంలోని కొన్ని ప్రాంతాలు కలిపి విజయనగరం జిల్లాగా ఏర్పాటు చేశారు. కానీ వీరికి విశాఖతోనే అనుబంధం ఎక్కువ.

విశాఖపట్నం ఎందుకు ప్రసిద్ధి చెందింది?

విశాఖపట్నం (Vizag) అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఒకటి. ఇది తన అందమైన బీచ్‌లు, శాంతియుత దృశ్యాలు, చారిత్రక ప్రదేశాల కారణంగా ప్రసిద్ధి చెందింది.

విశాఖపట్నాన్ని “డెస్టినీ సిటీ” అని ఎందుకు పిలుస్తారు?

విశాఖపట్నం లేదా విజాగ్‌ను “సిటీ ఆఫ్ డెస్టినీ” (City of Destiny) అంటే “విధి నగరం” అని పిలవడం వెనుక గొప్ప చరిత్ర, భౌగోళిక ప్రాధాన్యం, అభివృద్ధి ఉన్నవి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Pawan Kalyan: చిత్తూరులో ఏనుగుల దాడి.. రైతు మృతిపై డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870