Allu Arjun: ఆర్యలో హీరోగా బన్నీ అలా సెట్ అయ్యాడు: సుకుమార్

alluarjun sukumar

అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ తెలుగు చిత్రసీమలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది ఈ హిట్ జోడీ తన ప్రయాణాన్ని ఆర్య సినిమాతో ప్రారంభించింది తరువాత ఆర్య 2, పుష్ప మరియు త్వరలో రాబోయే పుష్ప 2: ది రూల్ చిత్రాలతో విజయవంతంగా కొనసాగింది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది కానీ ఈ కాంబినేషన్ వెనుక ఉన్న ఆసక్తికర పరిణామాలు ప్రత్యేకంగా ఆర్య సినిమా ఎలాఏ రూపుదిద్దుకుందో గురించి సుకుమార్ ఇటీవల ఒక సమావేశంలో వివరించారు.

సుకుమార్ మాట్లాడుతూ దిల్ సినిమా సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు తన జీవితాన్ని పూర్తిగా మార్చాయని చెప్పారు ఆయన రచనా శైలి కొన్ని సన్నివేశాలు మాంటేజ్ షాట్స్ గురించి నిర్మాత దిల్ రాజుకి చెప్పారు అవి దిల్ రాజుకి నచ్చడంతో దిల్ సినిమా హిట్ అయితే తనకు దర్శకుడిగా అవకాశం ఇస్తానని మాటిచ్చారని సుకుమార్ చెప్పారు దిల్ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత దిల్ రాజు పిలిపించి మొదట రీమేక్ చేయమని అడిగారని కానీ తాను నిర్మొహమాటంగా తిరస్కరించానని వివరించారు దాంతో సుకుమార్ కొత్త కథ చెప్పాలని అభ్యర్థించారు సుకుమార్ చెప్పిన కథ చాలా ఆసక్తికరంగా ఉండటంతో కొంత ఆలోచించిన తర్వాత దిల్ రాజు ఆ చిత్రానికి ఓకే చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు.

అయితే సుకుమార్ ముందే కొత్త నటులతో పని చేయాలని అనుకున్నారని కానీ హీరోని ఎంచుకోవడం పెద్ద సవాలుగా మారిందని చెప్పారు అప్పట్లో అల్లు అర్జున్ పేరు తాను వినిపించినప్పుడు అందరూ నవ్వారని ఆయన తెలిపారు కానీ ఒకసారి దిల్ సినిమా ప్రివ్యూ వేళ అల్లు అర్జున్ అటెండ్ అయ్యాడు అక్కడి వారందరినీ పలకరిస్తూ హుషారుగా అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ కౌగిలించుకుంటున్నప్పుడు సుకుమార్‌కి అతడిలో ఆర్య పాత్ర కనిపించిందని తెలిపారు ఆ క్షణం నుండే తన అభిప్రాయాన్ని మార్చుకున్న స్నేహితులు కూడా బన్నీనే ఆర్య పాత్రకు సరిపోతాడని ఒప్పుకున్నారన్నారుతదుపరి మూడు నెలలు ఆడిషన్స్ చేసిన తరువాత ఆర్య సినిమా నిర్మాణం మొదలయ్యిందని ఈ సినిమా తెలుగు సినిమా ప్రేమకథా చిత్రాలకు కొత్త దిశను ఇచ్చిందని సుకుమార్ చెప్పుకొచ్చారు ఈ చిత్రం విజయవంతం కావడంతో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ మేజిక్‌ని కొనసాగిస్తూ మరిన్ని హిట్ చిత్రాలు ఇచ్చారుఅల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ తర్వాతి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి మరియు ఇప్పుడు పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. Mushroom ki sabji : 5 delicious indian mushroom recipes brilliant hub.