ఏఐ వ్యవసాయంతో ఊహించని లాభాలు

AI: ఏఐ వ్యవసాయంతో ఊహించని లాభాలు

ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఇప్పటికే నూతన మార్గాలపై పయనిస్తోంది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే వ్యవసాయాన్ని శాస్త్రీయంగా, సాంకేతికంగా, డేటా ఆధారంగా చేయడం ప్రారంభించాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ ప్రతీ రంగంలో రోజురోజుకూ విస్తరిస్తూ ఉంది. భారత్‌లో బారామతి రైతుల ఈ ప్రయోగం ఈ మార్గంలో అడుగు వేసిన తొలి ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం శాస్త్రీయ ప్రయోగం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల భవిష్యత్తు మార్పుకు సంకేతంగా నిలుస్తోంది.

Advertisements

చెరకు పంటతో మార్పు

చెరకు పంట ద్వారా మొదలైన ఈ ఏఐ వ్యవసాయ విప్లవం తర్వాతి దశల్లో బియ్యం, మిర్చి, కూరగాయలు, పత్తి, గోధుమ వంటి పంటలకూ విస్తరించనుంది. దీని వల్ల ఒక్క రైతులకే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకూ భారీ ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత దేశం. జనాభాలో సుమారు 60 శాతం మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. అలాంటి రంగాన్ని సాంకేతికతతో మిళితం చేయడం వల్ల క్రాంతికార మార్పులు సంభవించవచ్చు. బారామతి రైతుల విజయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు స్పందించడం, ఇది సామాన్య రైతుకు ప్రపంచ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా భారత రైతు గ్లోబల్ టెక్నాలజీ వేదికపై నిలిచినట్లయింది. ఇది కొత్త మార్గాన్ని సూచించే ఉదాహరణగా నిలిచింది. సాధారణంగా చెరకు నెలకు 2 నుంచి 2.5 కణుపులు పెరుగుతుంది. ఒక్కో గెడకు 45 కణుపులు ఉంటాయి. కానీ ఈ ఏఐ సాగులో నెలకు 3.5 నుంచి 4 కణుపులు పెరుగుతాయి. ఒక గెడలో మొత్తంగా 55 కణుపులు ఉంటాయి. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుండగా.. ఆదాయం రూ.2 లక్షలు వస్తుంది. అదే ఏఐ సాగులో మాత్రం రూ.30 వేల నుంచి రూ.40 వేలు పెట్టుబడి పెడితే రూ.3 లక్షల దిగుబడి సంపాదించే అవకాశం ఉంది.

ఇతర రాష్ట్రాల్లోనూ ప్రారంభమవుతున్న ప్రయోగాలు

బారామతిలో విజయవంతమైన ఈ ప్రాజెక్ట్‌ను ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించేందుకు ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే రైతులు ఈ విధానాన్ని పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభమైయింది కూడా ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే, ఇది అతి తక్కువ కాలంలో దేశవ్యాప్తంగా విస్తరించగలదు.

రైతుల భద్రత, శిక్షణ కీలకం

ఏఐ వ్యవసాయాన్ని పూర్తిగా సాధించాలంటే రైతులకు శిక్షణ ఎంతో అవసరం. వారి వద్ద స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ లభ్యత ఉండాలి. మౌలిక సదుపాయాల మరమ్మతు, డిజిటల్ లిటరసీ పెంపు కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు అవసరం. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు కలిసి రైతులను ఈ మార్గంలో నడిపించాలి. ఈ రంగంలో ఏఐను చొప్పించాలంటే పాలకులు సరికొత్త విధానాలు రూపొందించాలి. మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీ బదిలీ, ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుతో పాటు, సబ్సిడీల రూపంలో ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ముఖ్యంగా చిన్న రైతులు దీన్ని అందుబాటులోకి తెచ్చుకునేలా ప్రభుత్వ పాత్ర కీలకం.

Read also: Temples: దేశంలోనే పేరొందిన రామాలయాలు ఇవే..తప్పక దర్శించుకోండి

Related Posts
నటి కాదంబరీ జత్వానీ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
AP government handed over the investigation of actress Kadambari Jethwani case to CID

అమరావతి: బాలీవుడ్ నటి కాదంబరీ జత్వాని కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు డీజీపీ Read more

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా నుండి గౌరవం
nigeria

నైజీరియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీరియా (GCON) అవార్డుతో సత్కరించనున్నది. ఈ గౌరవం, 1969లో క్వీన్ ఎలిజబెత్ Read more

ట్రంప్ టారిఫ్ పెంపు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని సూచిస్తుందా?
ట్రంప్ టారిఫ్ పెంపు ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని సూచిస్తుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా, మెక్సికో, మరియు చైనాలపై సుంకాల పెంపుదల శనివారం సాయంత్రం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ ప్రకటనతో వైట్ హౌస్ నుండి ఇతర Read more

జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం: ఎస్.ఎస్.వి స్క్రాప్ పరిశ్రమలో మంటలు
fire accident jeedimetla

హైదరాబాద్ జీడిమెట్లలోని ఎస్.ఎస్.వి స్క్రాప్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం మంగళవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. ఈ అగ్నిప్రమాదం ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన పరిశ్రమలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×