ఆంధ్ర పోలీసుల సమాచారంతో తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు దాడులు
హుజూర్ నగర్ (నల్గొండ): హుజూర్నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువు మండలంలో కల్తీ మద్యం (Adulterated liquor) తయారు చేసే ముఠా గుట్టు రట్టయింది. ఆంధ్ర పోలీస్ సమాచారంతో తెలంగాణ ప్రాంతంలోని హుజూర్నగర్ ఎక్సైజ్ పోలీసులు (Excise Police) ఏకకాలంలో దాడులు నిర్వహించి మూడు ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారు చేసే ముఠాను పట్టుకున్నారు.

స్పిరిట్ కల్తీ మద్యం
కల్తీ మద్యం (Adulterated liquor) తయారు చేస్తున్న ప్రాంతంలో కనిపించిన స్పిరిట్ కల్తీ మద్యం సీసాలు 20 లీటర్ల క్యాన్లు కనిపించిన తీరు ఎక్సైజ్ పోలీసులను కంగు తినిపించింది. మేళ్లచెరువు మండల కేంద్రంలో, మండల పరిధిలోని వేపల మాదారం, రామాపురం గ్రామంలో ఈ కల్తీ మద్యం దందా నిర్వహిస్తున్న తీరు చూసి పోలీసులే ఈ అవాక్కయ్యారు. మూడు ప్రాంతాల్లో వివిధ మద్యం దుకాణంలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. వీరందరూ తయారు చేస్తున్న కల్తీ మద్యాన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించగా గుంటూరు (Guntur) జిల్లా రేపల్లెలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. దీంతో తీగలాగితే డొంకంతా కలిగినట్టు దొరికిన వ్యక్తులు మేళ్లచెరువు మండలం నుంచి వచ్చినట్లు సమాచారం ఇవ్వగా, సమాచారాన్ని హుజూర్నగర్ ఎక్సైజ్ పోలీసులకు అందించారు. దీంతో ఎక్సైజ్ పోలీసులు మేళ్లచెరువు, వేపల మాదారం, రామాపురం గ్రామంలో దాడులు చేసి కల్తీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో శంకర్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న నూకల ప్రకాష్ వ్యక్తి యొక్క రైస్ మిల్ లో కల్తీ మద్యం తయారు చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి సరఫరా చేస్తున్నట్లు తేలింది. రైస్ మిల్లులో భారీ ఎత్తున కల్తీ మద్యం లభ్యమయింది.
కల్తీ మద్యం తో పాటు 40 కాటన్ల కల్తీ మద్యం సీసాలు, మద్యం తయారీకి ఉపయోగించే 830 లీటర్ల స్పిరిట్ కూడా లభ్యమైనట్టు తెలిసింది. వేపల మాదారం గ్రామంలో లొడంగి నవీన్ ఇంట్లో కూడా కల్తీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు మండల కేంద్రమైన మేళ్లచెరువులో నాగరాజు అనే వ్యక్తి నుంచి కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వివిధ మద్యం దుకాణాల్లో పనిచేసిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఈ కల్తీ మద్యం దందాకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. కల్తీ మద్యం తో పాటు ఏపీ 07 డి జెడ్ 6789 నెంబర్ గల కారు ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కల్తీ మద్యం తయారీ హుజూర్నగర్ తో పాటు కోదాడ నియోజకవర్గంలో కూడా పలు ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం. వీటిపై కూడా ఎక్సైజ్ పోలీసులు కూపి లాగుతున్నట్లు తెలిసింది.
కల్తీ మద్యం తయారీ ముఠా ఎక్కడ గుట్టురట్టు అయింది?
ఈ ముఠా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా కల్తీ మద్యం తయారుచేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుండి వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ఈ దాడులు నిర్వహించి ముఠాను బట్టబయలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Annavaram Devender : అన్నవరం దేవేందర్ కు దాశరథి పురస్కారం