Adi Pinishetti : ప్రేతాత్మల చుట్టూ తిరిగే కథ : ఓటీటీకి ‘శబ్దం’ ఆది పినిశెట్టి లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘శబ్దం’ సినిమా ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలైంది. గతంలో ఆది పినిశెట్టి హారర్ థ్రిల్లర్ ‘వైశాలి’ లో మెప్పించిన నేపథ్యంలో, ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయి విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కొత్త ప్రయాణం మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ‘శబ్దం’ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది.ఈ సినిమాకు అరివళగన్ వెంకటాచలం దర్శకత్వం వహించగా సంగీతాన్ని తమన్ అందించారు. కథలో కీలకంగా నిలిచే పాత్రల్లో సిమ్రాన్, లైలా, రాజీవ్ మీనన్, వివేక్ ప్రసన్న నటించారు.ఒక కాలేజ్‌లో విద్యార్థులు ఒకరి తరువాత ఒకరు చనిపోతుంటారు. అసలు ఏం జరుగుతోంది అనేది ఎవరికీ అర్థం కాదు.

ఈ ఊహించని మరణాల వల్ల కాలేజ్‌లో భయం విస్తరిస్తుంది. ఒక దశలో కాలేజ్ యాజమాన్యం ఇది ప్రేతాత్మల ప్రభావమే అనుకుంటుంది. దీంతో ఆత్మలతో మాట్లాడే శక్తి కలిగిన వైద్యలింగం అనే వ్యక్తిని రంగంలోకి దింపుతుంది. ఆత్మలతో మాట్లాడే శక్తి ఉన్న వైద్యలింగం ఈ MYSTERIOUS ఘటనలకు అసలు కారణం ఏమిటి అవి నిజంగా ఉన్నాయా లేక వెనుక మరొక కారణం ఉందా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ‘శబ్దం’ సినిమాను తప్పక చూడాలి.థియేటర్లలో ఆశించిన స్థాయి వసూళ్లు సాధించని ‘శబ్దం’ ఓటీటీలో మరొకసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఆస్వాదించే వారికి ‘శబ్దం’ ఓటీటీలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది.