బెంగళూరులోని బిటిఎం లేఅవుట్ వద్ద ఒక సందులో ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను వెంబడిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ ఫుటేజ్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరి మహిళల్లో ఓ మహిళలపై ఒక వ్యక్తి దాడి చేసి అఘాయిత్యానాకి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఆ మహిళ ప్రతిఘటించడంతో వారి నుంచి తప్పించుకున్న నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

26ఏళ్ల సంతోష్‌గా గుర్తింపు..
సీపీఫుటేజ్ ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బెంగళూరులోని ఓ జాగ్వార్ షోరూమ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న 26ఏళ్ల సంతోష్‌గా గుర్తించారు. ఇక అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా అతను బెంగళూరు నుండి తమిళనాడులోని హోసూర్‌కు పారిపోయినట్టు కనుగొన్నారు. ఆ తర్వాత సేలం, అక్కడి నుంచి కోజికోడ్‌కు పారిపోయినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో మూడు రాష్ట్రాల్లోని 700 సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసులు చివరకు కేరళలోని ఒక మారుమూల గ్రామంలో అతన్ని పట్టుకోగలిగారు. దాదాపు వారం పాటు కొనసాగిన వేటను ముగించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
రాజకీయ వివాదానికి దారితీసిన దాడి
ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర చేసిన దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారి తీశాయి. ఇంతపెద్ద నగరంలో ఇలాంటి ఘటనలు జరగడం సహజమని..అయినా చట్టప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీఅయిన బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళలపై నేరాలను ఆయన సాధారణీకరిస్తున్నారా? ఆయన్న వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
Read Also: Murder: ఆస్తి కోసం మహిళకు మద్యం తాగించి హత్య చేసిన బంధువులు