Ahmedabad Plane Crash : తీవ్ర విషాదం మిగిల్చిన ప్రమాదం

Read Time:  1 min
Ahmedabad Plane Crash : తీవ్ర విషాదం మిగిల్చిన ప్రమాదం
FONT SIZE
GET APP

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 241 మంది ప్రాణాలు కోల్పోయిన (241 Dies) ఈ ఘోర దుర్ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ప్రమాద వార్త తెలిసిన క్షణం నుంచి దేశం మౌనంగా నిలిచింది. లండన్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోవడం ఆ కుటుంబాలకు జీవితాంతం మిగిలిపోయే దుఃఖాన్ని తెచ్చిపెట్టింది.

విషాదంలో నగాన్తోయ్ శర్మ కుటుంబం

ఈ ప్రమాదంలో విమాన సిబ్బందిలో ఒకరైన నగాన్తోయ్ శర్మ మృతి చెందినట్లు అధికారికంగా తెలిసింది. ఆమె కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడేంతకి కూడా శక్తి కోల్పోయారు. శర్మ తల్లి ఆమె ఫోటోలను మీడియాకు చూపిస్తూ విలపించడం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. తన కుమార్తె ఇక లేడన్న ఆవేదనతో ఆమె చినుకుల్లా కన్నీళ్లు కార్చింది. ఇది ఒక్క కుటుంబం విషాదం మాత్రమే కాదు, ఓ దేశానికే కలకలం.

అంధకారంలో ప్రయాణికుల కుటుంబాలు

ఈ ప్రమాదం అనేక కుటుంబాల భవిష్యత్తును శూన్యంలోకి నెట్టేసింది. మృతుల కుటుంబీకులు తమవారిని కోల్పోయిన బాధను జీర్ణించుకోలేక విలపిస్తున్నారు. గుండెలు పగిలేలా మొరలు వినిపిస్తున్నాయి. మృతుల గుర్తింపు, శవాల అందజేత, సహాయక చర్యల నడుమ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా మద్దతుగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also : Air India : బోయింగ్ 787-8కు ఇదే తొలి ప్రాణాంతక ప్రమాదం!

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.