A terrible road accident.. 10 devotees died

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది భ‌క్తులు మృతి

ల‌క్నో: ఈరోజు ఉద‌యం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌-మీర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 10 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 19 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభ్‌లో పుణ్య‌సాన్నాలు చేసేందుకు వెళ్తున్న భ‌క్తులు ఆ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌యాగ్‌రాజ్‌-మీర్జాపూర్ హైవేపై ఉన్న మీజా ఏరియా వ‌ద్ద బొలెరో వాహ‌నం బ‌స్సును ఢీకొన్న‌ది.

Advertisements
ఘోర రోడ్డు ప్ర‌మాదం భ‌క్తులు

చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని కోర్బా జిల్లా నుంచి భ‌క్తులు సంగం స్నానాల కోసం ప్ర‌యాగ్‌రాజ్ వెళ్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌ర్ జిల్లా నుంచి వ‌స్తున్న బ‌స్సును.. బొలెరో వాహ‌నం ఢీకొట్టింది. ప్ర‌మాదం ప‌ట్ల యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఆరా తీశారు. త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న ఆదేశించారు. గాయ‌ప‌డ్డ వారికి చికిత్స అందిస్తున్నారు.

ఈ వారం ఆరంభంలోనే హైద‌రాబాద్ నుంచి వెళ్లిన ఏడుగురు భ‌క్తులు కూడా రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన విష‌యం తెలిసిందే. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పుర్ జిల్లాలో ఓ ట్ర‌క్కును బ‌స్సు ఢీకొన్న ఘ‌ట‌న‌లో హైద‌రాబాదీ భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. కుంభ‌మేళాలో జ‌న‌వ‌రి 29వ తేదీన జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 30 మంది మృతిచెంద‌గా, 25 మందిని గుర్తించిన‌ట్లు పోలీసు అధికారి వైభ‌వ్ కృష్ణ తెలిపారు. ఆ తొక్కిస‌లాట‌లో 60 మంది గాయ‌ప‌డ్డారు. జ‌న‌వ‌రి 13వ తేదీన మొద‌లైన మ‌హాకుంభ్‌.. ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన ముగియ‌నున్న‌ది.

Related Posts
నుమాయిష్ ప్రారంభం వాయిదా
numaish exhibition hyderaba

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడు రోజుల Read more

ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
Ponguleti kmm

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి తెలియజేశారు. ఈ Read more

అన్ని బస్సులకు ఉచిత ప్రయాణం :చంద్రబాబు నాయుడు
అన్ని బస్సులకు ఉచిత ప్రయాణం :చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విషయంపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు Read more

కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో మే 15 నుండి 26వ తేదీ వరకు మహా సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు Read more

×