జర్మనీలో రాజకీయంగా సంచలనంగా నిలిచిన ఓ పరిణామం చోటుచేసుకుంది. కన్జర్వేటివ్ పార్టీ నేత ఫ్రెడ్రిక్ మెర్జ్ జర్మనీ నూతన ఛాన్సలర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నిక అంత తేలికగా జరగలేదు. ప్రధాన అభ్యర్థిగా ఉన్న మెర్జ్, తొలి రౌండ్ ఓటింగ్‌లో మెజారిటీ సాధించడంలో విఫలమయ్యారు. యుద్ధానంతర జర్మనీ చరిత్రలో ఛాన్సలర్ అభ్యర్థి ఓటింగ్‌లో మొదటి ప్రయత్నంలోనే ఓడిపోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ అఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మొదటి రౌండ్‌లో తేడా తలెత్తింది
మొదట మెర్జ్ గెలుపు సునిశ్చితమని అంతా భావించినా, మొదటి రౌండ్‌లో తేడా తలెత్తింది. కానీ, రెండో విడత ఓటింగ్‌లో మాత్రం ఆయన 325 ఓట్లు సాధించి మెజారిటీ గెలుపుతో ఛాన్సలర్ పీఠాన్ని అధిరోహించారు. మొత్తం 630 ఓట్లలో 289 ఓట్లు ఆయనకు వ్యతిరేకంగా పోలయ్యాయి. ఈ విజయం ద్వారా ఆయన అధికారికంగా పదో ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మొదటి ఓటింగ్‌లో ఎదురైన షాక్ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన తిరిగి విజయం సాధించడం రాజకీయంగా గొప్ప విజయంగా పరిగణించబడుతోంది.
ఫ్రెడ్రిక్ మెర్జ్ నాయకత్వంలో జర్మనీకి స్థిరత్వం, అభివృద్ధి సాధ్యమవుతుందా?
ఫ్రెడ్రిక్ మెర్జ్ నాయకత్వంలో జర్మనీకి స్థిరత్వం, అభివృద్ధి సాధ్యమవుతుందా? అనే అంశంపై అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. యూరోపియన్ యూనియన్, యూఎస్, నాటో దేశాలతో సంబంధాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ వంటి కీలక అంశాల్లో మెర్జ్ ఎలా వ్యవహరిస్తారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్. జర్మనీలో కొత్త అధ్యాయం ప్రారంభమైన ఈ సమయంలో, మెర్జ్ నిర్ణయాలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.
Read Also : Visakhapatnam : విశాఖలో కరాచీ బేకరి పేరుపై వివాదం