Central Govt:వంటగ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన

Read Time:  1 min
Central Govt:వంటగ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన
FONT SIZE
GET APP

Central Govt: దేశంలో వంటగ్యాస్ (LPG) కొరత ఏర్పడనుందనే ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. గృహ వినియోగదారులకు 100 శాతం సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ గృహావసరాలకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఎల్పీజీతో పాటు పెట్రోల్, డీజిల్ లభ్యతపై కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలోని అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, తగినంత స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేస్తూ వినియోగదారులకు భరోసా ఇచ్చింది.

Read Also: Shriyanshi: బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

Central Govt:వంటగ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన
Central Govt: Statement on Cooking Gas Shortage

పశ్చిమాసియాలో భారత నౌకలు సురక్షితం

పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరిన శివాలిక్ ఎల్పీజీ క్యారియర్ హర్మూజ్ జలసంధిని దాటి భారతదేశం సమీపానికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నేడు సాయంత్రం 5 గంటలకు ఈ క్యారియర్ భారత్ చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

పశ్చిమాసియా ప్రాంతంలోని అన్ని భారత నౌకలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రతి నౌకలోని సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 611 మందితో కూడిన 22 భారతీయ జెండా కలిగిన నౌకలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.