WhatsApp New Features: వాట్సాప్ వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించేలా మూడు కొత్త ఫీచర్లను విడుదల చేసింది. ఇకపై గ్రూప్ చాట్స్(Group chats)లో సభ్యుల పాత్రలను స్పష్టంగా చూపించేలా ‘మెంబర్ ట్యాగ్స్’ ఏర్పాటు చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఒక గ్రూప్‌లో ‘కెప్టెన్’, మరో గ్రూప్‌లో ‘అమ్మ’ లేదా ‘మేనేజర్’ వంటి ట్యాగ్‌లను సభ్యులకు కేటాయించవచ్చు.
Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్

మెంబర్ ట్యాగ్స్, టెక్స్ట్ స్టిక్కర్స్, ఈవెంట్ రిమైండర్స్
అంతేకాదు, సాధారణంగా టైప్ చేసిన ఏ పదాన్నైనా వెంటనే స్టిక్కర్‌గా మార్చుకునే ‘టెక్స్ట్ స్టిక్కర్స్’ ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. అలాగే మీటింగ్స్, పుట్టినరోజులు, పార్టీల వంటి ముఖ్యమైన కార్యక్రమాలను మర్చిపోకుండా గుర్తు చేసే ‘ఈవెంట్ రిమైండర్స్’ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్లతో గ్రూప్ నిర్వహణ మరింత సులభంగా మారనుంది. పెద్ద గ్రూప్‌లలో ఎవరి బాధ్యత ఏంటో తేలికగా గుర్తించేందుకు మెంబర్ ట్యాగ్స్ ఎంతో ఉపయోగపడనున్నాయి. టెక్స్ట్ స్టిక్కర్స్(Text stickers) ద్వారా చాటింగ్‌కు మరింత క్రియేటివిటీ జతకానుంది. ఈవెంట్ రిమైండర్స్ ఫీచర్ ద్వారా వాట్సాప్‌ను కేవలం చాటింగ్ యాప్‌గా కాకుండా, రోజువారీ పనులను గుర్తు చేసే ఒక డిజిటల్ అసిస్టెంట్‌లా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్లు దశలవారీగా అన్ని వినియోగదారులకు విడుదల కానున్నట్లు సమాచారం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: