हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Palash Muchhal: వదంతులను కొట్టి పారేసిన పలాష్ తల్లి అమితా ముచ్చల్

Aanusha
Latest News: Palash Muchhal: వదంతులను కొట్టి పారేసిన పలాష్ తల్లి అమితా ముచ్చల్

భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) పెళ్లి అర్థాంతరంగా ఆగిపోవడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది.. ఆమె ప్రియుడు, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అస్వస్థతకు గురయ్యారు.

Read Also: Cricket : 500 పరుగులతో సౌతాఫ్రికా ఆధిక్యం

గుండెపోటు లక్షణాలతో ఆయన సాంగ్లీలోని ఒక ఆసుపత్రిలో చేరడంతో, తండ్రి లేకుండా వివాహం వద్దని స్మృతి నిర్ణయించుకున్నట్లు ఆమె మేనేజర్ తెలిపారు.పెళ్లి ఆగిపోయిన కొద్ది రోజులకే పలాష్ ముచ్చల్ (Palash Muchhal) కూడా అనారోగ్యంతో సాంగ్లీ ఆసుపత్రిలో చేరారు. వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో బాధపడుతున్న అతడిని ముంబైలోని గోరేగావ్ ఆసుపత్రికి తరలించారు. వరుస మ్యూజిక్ కచేరీలు, వివాహ పనుల ఒత్తిడి వల్లే పలాష్ ఆరోగ్యం దెబ్బతిన్నదని అతడి సన్నిహితులు పేర్కొన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల వదంతులు వ్యాపించాయి. ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ పుకార్లపై పలాష్ తల్లి అమితా ముచ్చల్ స్పందించి, అసలు విషయం వెల్లడించారు. “స్మృతి కంటే ఆమె తండ్రితోనే పలాష్‌ (Palash Muchhal) కు ఎక్కువ అనుబంధం ఉంది.

Palash's mother Amita Muchhal refutes rumors
Palash’s mother Amita Muchhal refutes rumors

తనే పట్టుబట్టాడు

ఆయన అనారోగ్యం గురించి తెలియగానే వివాహం వాయిదా వేయాలని నిర్ణయించుకున్నది స్మృతి కాదు, పలాషే. మామగారు కోలుకున్నాకే వివాహం చేసుకోవాలని తనే పట్టుబట్టాడు,” అని ఆమె స్పష్టం చేశారు.”స్మృతి తండ్రికి ఛాతీ నొప్పి అని తెలియగానే పలాష్ చాలాసేపు ఏడ్చాడు. ఆ ఒత్తిడితోనే అతడి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది.

ఆసుపత్రిలో అతడికి ఐవీ డ్రిప్ పెట్టి, ఈసీజీతో పాటు ఇతర పరీక్షలు చేశారు. రిపోర్టులు సాధారణంగానే ఉన్నా, ఇంకా ఒత్తిడి నుంచి బయటపడలేదు,” అని అమిత వివరించారు. పలాష్ సోదరి, గాయని పాలక్ ముచ్చల్ కూడా స్పందిస్తూ, ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870