Delhi air pollution : శీతాకాలం ప్రారంభంతో ఢిల్లీ–NCRలో గాలికాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో CAQM (Commission for Air Quality Management) కొత్త మార్పులతో GRAP నియమాలను కఠినతరం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో AQI 360గా నమోదై “చాలా చెడు” కేటగిరీలో ఉంది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇప్పటి వరకు GRAP-IVలో ఉండే కొన్ని కఠిన నియమాలను GRAP-III లోకే మార్చారు. అంటే, పరిస్థితి మరింత దిగజారకుండా ముందుగానే కఠిన చర్యలు తీసుకుంటారు.
Latest News: KTR: CM అబద్ధాలని CAG బట్టబయలు?
ప్రభుత్వాలు ఇప్పుడు పబ్లిక్, ప్రైవేట్, మునిసిపల్ కార్యాలయాల్లో 50% హాజరు, మిగతావారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకోవాలి. IDelhi air pollution) కేంద్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగుల కోసం ఇదే విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇతర మార్పులు కూడా చేశారు —
- ప్రభుత్వ కార్యాలయాల్లో స్టాగర్డ్ టైమింగ్స్ (ఇప్పటికే GRAP-IIIలో ఉండేది) ఇప్పుడు GRAP-II లోకి షిఫ్ట్ చేశారు (AQI 301–400).
- ప్రజలకు సలహాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పెంపు వంటి చర్యలు GRAP-IIలో ఉండేవి, ఇప్పుడు మరింత ముందుగానే GRAP-I లో అమలవుతాయి (AQI 201–300).
CAQM అన్ని ఏజెన్సీలకు ఈ మార్పులను వెంటనే అమలు చేయాలని ఆదేశించింది.
గాలి నాణ్యత 0–50 మంచి, 51–100 తగిన, 101–200 మోస్తరు, (Delhi air pollution) 201–300 చెడు, 301–400 చాలా చెడు, 401–500 అత్యంత ప్రమాదకరం గా CPCB పేర్కొంది.
ఇంతలో, ఢిల్లీ ప్రభుత్వం నవంబర్–డిసెంబర్‌లో జరిగే అన్ని స్కూల్–కాలేజ్ క్రీడా కార్యక్రమాలను వాయిదా వేసింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :