అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) విశాఖపట్నంలో ప్రపంచ స్థాయిలో జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. ఈరోజు జరిగే ఈ కార్యక్రమం ద్వారా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. గతంలో సూరత్‌లో ఏర్పడిన గిన్నిస్ రికార్డును అధిగమించాలనే సంకల్పంతో “యోగాంధ్ర” పేరుతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
2 కోట్ల మందితో యోగా – రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా శిబిరాలు
ఈ మహాయోగా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఢిల్లీకి చెందిన మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాతో కలిసి 3,000 మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేశారు. వారు రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల మంది స్థానిక శిక్షకులకు శిక్షణనిచ్చారు. యోగాంధ్రను విజయవంతంగా నిర్వహించేందుకు పాఠశాలలు, గ్రామ/వార్డు సచివాలయాలు, నివాస ప్రాంతాలు, జిల్లా కేంద్రాల్లో 1 లక్షకు పైగా ప్రదేశాల్లో ఒకే విధమైన యోగా ప్రోటోకాల్‌ను అనుసరించనున్నారు.
విశాఖ బీచ్ రోడ్డుపై 5 లక్షల మందితో యోగా విస్తార కార్యక్రమం
ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు విశాఖ ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవున 5 లక్షల మంది ఒకేసారి యోగా చేయనున్నారు. 15 ఇతర ప్రాంతాల్లో మరో 2 లక్షల మంది పాల్గొంటారు. మొత్తం 300,000 మందికి పైగా యోగా మెట్‌లు సిద్ధం చేశారు. విశాఖ నగరంలో పండుగ వాతావరణం నెలకొని ఉంది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు కలిసి ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు.
Read Also : F-35B Lightning II : ఎయిరిండియా హ్యాంగర్ ఆఫర్ కు నో చెప్పిన బ్రిటన్ నేవీ