ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న దృఢమైన చర్యలు మరింత ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Modi – Trump) మధ్య జరిగిన ఫోన్ల సంభాషణలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఉగ్రదాడులను ఇకపై యుద్ధంగానే పరిగణించాలని ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది, దీన్ని ఎవరూ ఆపలేరు, పాక్ కు ఎలాంటి దేశం లేదా శక్తి మద్దతు ఇస్తే సహించమని స్పష్టం చేశారు.
35 నిమిషాల పాటు ఇద్దరూ చర్చలు
ఈ ఫోన్ సంభాషణలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, ఇండో-పసిఫిక్ భద్రతా అంశాలు వంటి అంతర్జాతీయ స్థాయిలో సంచలనం కలిగిస్తున్న అంశాలపై 35 నిమిషాల పాటు ఇద్దరూ చర్చించారు. మోదీ స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే.. ఉగ్రవాదానికి ఏ రూపంలోనూ ప్రోత్సాహం ఇస్తే అది ఇక భరించదగిన విషయం కాదని. భారత్ మానవత్వం కోసం, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై ట్రంప్ మద్దతు తెలపడం గమనార్హం.
మోదీకి ట్రంప్ అమెరికా వచ్చేందుకు ఆహ్వానం
ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్న మోదీకి ట్రంప్ అమెరికా వచ్చేందుకు ఆహ్వానం పంపారు. అయితే ముందుగానే షెడ్యూలైన కార్యక్రమాల కారణంగా మోదీ తాను రావలేనని తెలపడం జరిగింది. అయినా భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడే దిశగా ఈ సంభాషణ దోహదపడిందని విదేశాంగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందన్న ప్రధాని వ్యాఖ్యలతో దేశ భద్రతపై భారత్ తీసుకుంటున్న గంభీర వైఖరి మరోసారి స్పష్టమైంది.
Read Also : Virat Kohli: లండన్‌లోని కోహ్లీ ఇంట్లో గడిపిన భారత క్రికెటర్లు