భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)లో పాకిస్థాన్(Pakistan)కు తీవ్ర నష్టం జరిగింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 64 మంది పాక్ సైనికులు మరియు అధికారులు మృతి చెందారని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. పాక్ శత్రుదేశంగా వ్యవహరిస్తూ డ్రోన్ స్థావరాలు, వాయుస్థావరాలను ఉపయోగించి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో, భారత సైన్యం ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది.
సుమారు 90 మంది పాక్ సైనికులు గాయపడ్డారు
ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కి చెందిన కీలక స్థావరాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఇందులో పలు రాడార్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్ కేంద్రాలు లక్ష్యంగా మారాయి. ఈ దాడుల్లో సుమారు 90 మంది పాక్ సైనికులు గాయపడ్డారని తాజాగా భారత సైన్యం వెల్లడించింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ దాడి తర్వాత పాక్ సైన్యంలో భయాందోళన నెలకొంది.
భారత భద్రతకు ముప్పుగా మారిన అంశాలు
ఇండియన్ ఆర్మీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ దాడులు పూర్తిగా వ్యూహాత్మకంగా, అత్యాధునిక ఆయుధాల వినియోగంతో నిర్వహించబడ్డాయి. భారత భద్రతకు ముప్పుగా మారిన అంశాలను నిరోధించేందుకు తీసుకున్న ఈ చర్య పక్కాగా అమలైనదిగా సైనిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిమిత స్థాయిలో హై అలర్ట్ ప్రకటించి, దేశ సరిహద్దుల్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసినట్లు భారత సైన్యం తెలిపింది.
Read Also : Telangana Raj Bhavan : తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ