Service charges in Delhi restaurants.. High Court angers

High Court : ఢిల్లీ రెస్టారంట్లలో సర్వీస్‌ ఛార్జీలు.. హైకోర్టు ఆగ్రహం

Service charge: ఢిల్లీ హైకోర్టు హోటళ్లు, రెస్టారంట్లు ఆహార బిల్లులలో సర్వీస్ ఛార్జీలను కలిపి వసూలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వీస్‌ ఛార్జీలను వినియోగదారులు కచ్చితంగా చెల్లించేలా బిల్లులో వాటిని కలిపి ఇవ్వడం వారి హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. రకరకాల పేర్లతో ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమైన వ్యాపార విధానాలతో సమానమని మండిపడింది. సర్వీస్‌ ఛార్జీలు చెల్లించాలా.. వద్దా..? అనే విషయాన్ని కస్టమర్ల విచక్షణకే వదిలేయాలని సూచించింది.

ఢిల్లీ రెస్టారంట్లలో సర్వీస్‌ ఛార్జీలు

అదనపు ఛార్జీలను విధించే రెస్టారంట్లపై తగిన చర్యలు

ఈ విధంగా వినియోగదారులపై అదనపు ఛార్జీలను విధించే రెస్టారంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థకు సూచించింది. హోటళ్లు బిల్లులలో సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేయడాన్ని నిషేధిస్తూ వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) గతంలో చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ పలు రెస్టారంట్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

హోటళ్లు కస్టమర్లపై ఇష్టారాజ్యంగా సర్వీస్‌ ఛార్జీలు

కొన్ని రకాల హోటళ్లు, రెస్టారంట్లలో వసూలు చేస్తున్న సర్వీస్‌ ఛార్జీలు.. పన్నుల కిందికి రావని కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రకటించింది. వీటిని సేవా పన్నుగా పరిగణించడం పొరపాటేనని తెలిపింది. వాటి చెల్లింపులను వినియోగదారుడి అంగీకారానికే వదిలేస్తున్నట్లు అన్ని హోటళ్లలో బోర్డు ప్రదర్శించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం బిల్లులో సేవా రుసుము కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలి. అయినప్పటికీ హోటళ్లు కస్టమర్లపై ఇష్టారాజ్యంగా సర్వీస్‌ ఛార్జీలు విధిస్తున్నాయి.

Related Posts
చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటా – హీరోయిన్ కీలక వ్యాఖ్యలు
chiranjeevi urvashi rautela

మెగాస్టార్ చిరంజీవిపై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి తనకు దేవుడి వంటి వ్యక్తి అని పేర్కొంటూ, తన కుటుంబానికి ఆయన చేసిన Read more

రేపటి నుంచే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ
rajeev

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ రేపటి నుండి ప్రారంభం కానుంది. అర్హత గల నిరుద్యోగ యువత ఈ Read more

IBPS PO 2024 రిజల్ట్: ప్రిలిమ్స్ ఫలితాలు, కట్ ఆఫ్ మార్కులు విడుదల!
ibps po result

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) పిఓ (ప్రొబేషనరీ ఆఫీసర్) 2024 ప్రిలిమినరీ పరీక్ష రిజల్ట్స్ మరియు కట్ ఆఫ్ మార్కులు త్వరలో విడుదల కానున్నాయి. Read more

Corona : కరోనా బారినపడ్డ పాక్ అధ్యక్షుడు
Pakistan President corona

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా, వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతానికి ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *