Always respect Chandrababu leadership.. GV Reddy

చంద్రబాబు నాయకత్వంపై ఎప్పటికీ గౌరవం : జీవీ రెడ్డి

అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన జీవీ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై, ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయకత్వంపై తనకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘కూటమి ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ బడ్జెట్ రూ. 3 లక్షల 22 వేల కోట్లతో ప్రణాళికబద్ధంగా రూపొందించారు. కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే బడ్జెట్ రూపొందించడం విశేషం.

Advertisements

2029లో కూడా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అవ్వాలి

నేను (జీవీ రెడ్డి) నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయకత్వంపై ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటాయి. తక్కువ కాలంలోనే అటు టీడీపీ లోనూ, ఇటు ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడాన్ని నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ మా సార్ చంద్రబాబు రుణపడి ఉంటాను. అని జీవీ రెడ్డి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు. ఏపీ పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవాలి. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలనే కోరుకోవడం తెలుగు వ్యక్తి బాధ్యత అని జీవీ రెడ్డి తన పోస్టులో రాసుకొచ్చారు.

Related Posts
ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
Election Commission released the list of voters

హైదరాబాద్: తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం విడుదల చేసింది. సవరణ తర్వాత తుది ఓటర్ల జాబితాను సీఈవో సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. జాబితా ప్రకారం, Read more

CSK : చెపాక్లో చెన్నై చెత్త రికార్డులు!
CSKchetta record

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. నిన్న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ Read more

పేర్ని నాని బెయిల్ మంజూరు కేసులో కీలక పరిణామం
పేర్ని నాని బెయిల్ మంజూరు కేసులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో Read more

HCU విద్యార్థులపై కేసులను ఎత్తివేస్తాం: భట్టి
We will drop cases against HCU students.. Bhatti Vikramarka

HCU: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. వర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దుందుడుకుగా వ్యవహరించవద్దని సూచనలు చేశారు. Read more

×