8 former AAP MLAs joined BJP

బీజేపీలో చేరిన 8 మంది ఆప్‌ మాజీ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉన్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి గట్టిదెబ్బ పడింది. ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలు శనివారంనాడు బీజేపీలో చేరారు. వీరితో పాటు పలువురు కౌన్సిలర్లు సైతం బీజేపీ కండువా కప్పుకున్నారు. వందన గౌర్ (పాలం), రోహిత్ మెహ్రౌలియా (త్రిలోక్‌పురి), గిరీష్ సోని (మాదిపూర్), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), రాజేష్ రిషి (ఉత్తం నగర్), బీఎస్ జూన్ (బిజ్వాసన్), నరేష్ యాదవ్ (మెహ్రౌలి), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్) కాషాయ కండువా కప్పుకున్నారు.

image

బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యేలలో భావన కౌర్ రెండు సార్లు పాలమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవగా, మదన్‌లాల్ మూడుసార్లు కస్తూర్బా నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గిరిష్ సోని మూడుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యే కాగా, రాజేష్ రిషి రెండుసార్లు ఎన్నికయ్యారు. వీరితో పాటు నరేష్ యాదవ్, పవన్ శర్మ, బీఎస్ జూన్, రోహిత్ మెహ్రోలియా, బిజేంద్ర గార్గ్ బీజేపీలో చేరారు. ఆప్ కౌన్సిలర్ జయ్ రాయ్ సైతం కమలం గూటికి చేరారు.

ఆప్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని, అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పార్టీ టిక్కెట్ దక్కలేదు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామ చేసిన ఎమ్మెల్యేలంతా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఢిల్లీ బీజేపీ ఇన్‌చార్జి బైజంయత్ పాండ, ఢిల్లీ బీజేపీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ సమక్షంలో ఆ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన నేతలకు పాండ స్వాగతం పలికారు. అప్‌దా నుంచి నేతలు విముక్తి పొందడం చారిత్రకమని, ఢిల్లీ 5న జరిగే ఎన్నికలతో ఆప్‌దా నుంచి ఢిల్లీ సైతం విముక్తి పొందుతుందని పాండ అన్నారు. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్, ఫిబ్రవరి 8న కౌంటింగ్ జరుగుతుంది.

Related Posts
ప్రముఖ నటుడు మోహన్ రాజ్ కన్నుమూత
Actor Mohan Raj passed away

తిరువనంతపురం: సినీ పరిశ్రమ మరో అద్భుత నటుడిని కోల్పోయింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ విలన్ మోహన్ రాజ్ తుది శ్వాస విడిచారు. 72 Read more

టీటీడీ అధికారులపై చంద్రబాబు ధ్వజం
టీటీడీ అధికారులపై చంద్రబాబు ధ్వజం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరిగిన తొక్కిసలాట సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులు, పోలీసులు, మరియు సంబంధిత వ్యవస్థలను తీవ్రంగా ప్రశ్నించారు. ఆయన Read more

కేబీఆర్ పార్కు విస్తరణపై హైకోర్టును ఆశ్రయించిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
kancharla chandrasekhar2

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, సినీ నటుడు అల్లు అర్జున్ మామగారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించడం రాష్ట్ర రాజకీయాల్లో Read more

లోక్‌సభ లో జమిలి ఎన్నికల బిల్లు
WhatsApp Image 2024 12 17 at 1.06.13 PM (1)

ఎంతో కాలంగా బీజేపీ పట్టుదలతో జమిలి ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న విషయం తెలిసేందే. ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *