Headlines
Collapsed roof at railway station

రైల్వేస్టేషన్‌లో కూలిన పైకప్పు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కన్నౌజ్‌ రైల్వేస్టేషన్‌లోని నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోవడం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లలో ఇప్పటివరకు 23 మందిని బయటికి తీశారు. మిగతావారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రమాదం జరిగనప్పుడు దాదాపు 35 మంది సిబ్బంది ఘటనా స్థలంలో ఉన్నారు.

image
image

ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇదిలాఉండగా.. కన్నౌజ్‌ రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే సిబ్బంది పలు నిర్మాణాలు చేపట్టారు. అయితే శనివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. భారీ శబ్దం వచ్చింది. దీంతో అక్కడున్న స్థానికులు భయందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై స్పష్టత లేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు పైకప్పు కూలిన ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని కోరారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50,000, అలాగే స్వల్పంగా గాయపడిన వారికి రూ.5,000 పరిహారాన్ని యోగీ సర్కార్ ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Link. Warehouse. Were.