Headlines
dil raju

తప్పుగా అనుకోవద్దు: దిల్ రాజు

తెలంగాణ దావత్ నేను మిస్సవుతున్నాను. సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని ఉంది అని చెప్పటం నా ఉద్దేశం’’ అని దిల్ రాజు అన్నారు. ‘‘సంక్రాంతి పండుగకు ఆంధ్రాలా తెలంగాణలో వైబ్ ఉండదు. తెల్ల కల్లు, మటన్ మాంసం మీద వైబ్స్ ఉంటాయి’’ అంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యల విషయం తెలిసిందే. దీంతో దిల్ రాజు తెలంగాణ వాళ్లను అవమానించేలా మాట్లాడారంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలపై దిల్‌రాజు స్పందిస్తూ.. శనివారం వీడియోను విడుదల చేశారు.

‘‘మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్, తెల్ల కల్లు గురించి మాట్లాడాను. ఆ మాటల్లో తెలంగాణ వాళ్లను అవమానించానని, అవహేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్లు చేసి, సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది.
హీరో వెంకటేష్ నటించిన ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ సినిమా ఈవెంట్‌లో భాగంగా ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మన సంస్కృతిని నేను అభిమానిస్తా. అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది.

‘‘నా మాటలు తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమించండి. మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకుంటున్న వారికి నా క్షమాపణలు.. సినిమా రంగంలో కిందిస్థాయి నుంచి ఎఫ్ఎసీ ఛైర్మన్‌గా ఎదిగాను. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు ప్రభుత్వానికీ మధ్యలో ఉంటూ పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నా.

తెలంగాణలో తెలుగు సినిమా అభివృద్ధి చెందడంతో పాటు, యువతకు ఉపయోగపడేలా పనిచేస్తా. .ఇలాంటి అనవసర విషయాల్లోకి నన్ను లాగొద్దని తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా‌’’ అంటూ దిల్‌రాజు వీడియోలో చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 the fox news sports huddle newsletter. Choosing food by domestic helper | 健樂護理有限公司 kl home care ltd. Dprd kota batam.