హైదరాబాద్: ఈనెల 27న కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సంవిధాన్ బచావో కార్యక్రమంలో వారు పాల్గొంటారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ తదితర కార్యక్రమాలను కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే.
రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణకు రావడంతో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్తగా మంత్రులకు ఎవరెవరికీ అవకాశాలు ఇవ్వాలని వారు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు తాము మంత్రులం అంటే తాము మంత్రులం అని వారికి వారే ప్రకటించుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కి మంత్రి పదవీ దక్కే అవకాశం ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి.