భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ తన 16 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులు నెలకొల్పాడు.టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కోహ్లీ చూపించిన ప్రతిభకు మోసమే లేదు. కానీ అతని కెరీర్‌లో ఒకే ఒక్క రికార్డు మాత్రం అందుబాటులోకి రాలేదు—ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడి,12 ఇన్నింగ్స్‌ల్లో 529 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఐదు అర్ధసెంచరీలు సాధించాడే కానీ సెంచరీ మాత్రం చేయలేకపోయాడు.2017లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో విరాట్ సెంచరీకి అత్యంత దగ్గరగా వెళ్లాడు.ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 265 పరుగులు చేయగా,భారత్ 41వ ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ అద్భుతంగా 123 పరుగులు చేయగా,విరాట్ 78 బంతుల్లో 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.కేవలం నాలుగు పరుగుల తేడాతో అతని సెంచరీ కల తీరలేదు.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడనుంది.
ఆ తర్వాత ఫిబ్రవరి 23న టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.మరో మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో జరగనుంది.ఈ టోర్నమెంట్ పాకిస్తాన్, దుబాయ్ వేదికలపై జరుగుతుంది.భారత జట్టు దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు ఆడనుంది.ఒకసారి నాలుగు పరుగుల తేడాతో విఫలమైన కోహ్లీ, ఈసారి అదే తప్పును పునరావృతం చేయడం లేదు.తన 16 ఏళ్ల కెరీర్‌లో మిగిలిన ఈ ఒక్క రికార్డును పూర్తి చేయాలని కోహ్లీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. మరి ఈసారి కోహ్లీ తన కలను నిజం చేసుకుంటాడో లేదో చూడాలి. విరాట్ కోహ్లీ ఆటతీరును చూసి క్రికెట్ ప్రేమికులు ఆశతో ఎదురు చూస్తున్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అతని బ్యాట్ నుండి శతక ధ్వని వినిపిస్తుందేమో చూడాలి.