మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అద్భుతమైన మతపరమైన సమావేశం. ఈ అద్భుతమైన వేడుక ఈ సారి ప్రయాగ్‌రాజ్‌లో జరగనుంది.
జనవరి 13న ప్రారంభమయ్యే ఈ మహాకుంభం 45 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున షాహి స్నానంతో ముగుస్తుంది.ఇప్పటికే ఈ జాతర సందడి మొదలైంది, సాధువులు, భక్తులు,యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు.ఈ మధ్యనే కొంతమంది ఋషులు, సాధువులు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు,వీరు తమ ప్రత్యేక గుర్తింపుతో ఆకర్షణీయంగా మారారు.అలాంటి కొందరు సాధువుల గురించి తెలుసుకుందాం.ఉత్తర్ ప్రదేశ్‌లోని త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న మహాకుంభ జాతర ప్రారంభమవనుంది. 45 రోజుల పాటు ఈ మహాకుంభం వైభవంగా సాగి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున షాహి స్నానంతో ముగుస్తుంది.ఈ మహాకుంభ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తారు.ఇప్పటికే కుంభమేళలో పాల్గొనేందుకు సాధువులు, ఋషుల బృందాలు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోవడం మొదలు పెట్టారు.ఈ వేడుకలో పాల్గొనే గొప్ప సాధువులు భక్తులను ఆకట్టుకుంటున్నారు.
వీరు తమ ప్రత్యేక గుర్తింపుతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.అంబాసిడర్ బాబా 1972 మోడల్ కారులో మహాకుంభ చేరుకున్నారు.ఈ కారుతోనే బాబా గత నాలుగు కుంభమేళాల్లో పాల్గొన్నట్లు చెప్పాడు. ఈ ప్రత్యేక కారులోనే బాబా తినేవాడు, తాగేవాడు, పడుకునేవాడు.1975 మోడల్ కారులో ప్రయాగ్‌రాజ్ చేరుకోవడానికి బాబాకు ఒకటి నరడు రోజులు పట్టినట్లు తెలిపారు. మహాకుంభం తర్వాత బనారస్, గంగాసాగర్ సందర్శనకు వెళ్లాలని బాబా తెలిపారు.రుద్రాక్ష బాబా కూడా బాగా ప్రాచుర్యం పొందాడు. ఆయన 108 పూసలు రుద్రాక్ష మాలను ధరించే బాబా. ప్రస్తుతం ఆయన ధరించే రుద్రాక్ష మాల బరువు 30 కిలోల కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ప్రజలు ఆయనను రుద్రాక్ష బాబా అని పిలుస్తున్నారు. ఆయన గత కాలంగా రుద్రాక్ష మాలను ధరించానని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ఈ మహాకుంభంలో మరిన్ని అద్భుతమైన, ఆసక్తికరమైన వ్యక్తులు పాల్గొంటున్నారు.