శబరిమలలోని అయ్యప్ప దేవాలయం ప్రస్తుతం అత్యధిక భక్తుల రద్దీతో సందడిగా మారింది. 41 రోజుల అయ్యప్ప దీక్షను పూర్తి చేసిన స్వాములు తమ మొక్కులు తీర్చుకునే కోసం ఆలయానికి చేరుకుంటున్నారు. ఈ సీజన్‌లో రికార్డు సంఖ్యలో భక్తులు అయ్యప్పను దర్శించుకుని తమ దీక్షను విరమిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఆలయ అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, శబరిమలలో వర్షిక మండల పూజకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో భక్తుల రద్దీని గమనించిన ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ (TDB) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 25 మరియు 26 తేదీలలో అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని భావిస్తోంది.TDB ప్రకారం, డిసెంబర్ 25న 50,000 మంది భక్తులు మాత్రమే అయ్యప్ప స్వామిని దర్శించుకోగలరు.
26వ తేదీన, ఇది 60,000 మందికి పరిమితం చేయబడుతుంది.ఇలాంటి పెద్ద పర్వదినాలలో భక్తుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో, స్పాట్ బుకింగ్ సంఖ్యను కూడా తగ్గించామని, కేవలం 5,000 మందికి మాత్రమే స్వామి దర్శనం అనుమతిస్తామని TDB ప్రకటించింది.ఇప్పటికే ప్రారంభమైన అయ్యప్ప థంక అంకి ఊరేగింపు రేపు శబరిమల ఆలయం వద్దకు చేరుకోనుంది. స్వామివారిని నగలతో అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయితే, భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ రెండు రోజుల పాటు (డిసెంబర్ 25, 26) అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల సంఖ్యను పరిమితం చేయడం, భక్తుల భద్రత కోసం తీసుకున్న అత్యంత కీలక చర్యగా మారింది.