Headlines
chandrababu

బీసీల రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ కసరత్తు

బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పనపై ముఖ్యమంత్రి సమీక్షించారు. బాలికల హాస్టళ్లు తక్షణమే మరమ్మతులు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 1,110 బీసీ విద్యార్థుల హాస్టళ్లు ఉన్నాయి. వాటిల్లో బాలురు 58,022 మంది, బాలికలు 37,794 మంది ఉంటున్నారు. ప్రభుత్వ భవనాలు 660 ఉండగా, అద్దె భవనాలు 450 ఉన్నాయి. గత ప్రభుత్వం పెట్టిన రూ.110.52 కోట్ల డైట్ బిల్లుల్లో రూ.76.38 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించగా రూ.34.14 కోట్లు పెండింగులో ఉన్నాయి… వాటిని కూడా చెల్లించాలని ఆదేశించారు.

2024-25 సంవత్సర బడ్జెట్లో ప్రభుత్వం రూ.135 కోట్లు కేటాయించింది. ఆగస్టు నాటికి కాస్మోటిక్ బిల్లులు రూ.200 కోట్లు పెండింగులో ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.7.10 కోట్లు చెల్లించింది. విద్యార్థుల ట్రంక్ బాక్సులు, ఇతర వస్తువులకుగాను ప్రభుత్వం బడ్జెట్ లో రూ.18 కోట్లు కేటాయించింది. వీటిని త్వరలోనే ప్రభుత్వం కొనుగోలు చేసి విద్యార్థులకు అందించనుంది.
రిపేర్లను వెంటనే పూర్తి చెయ్యాలి
డైట్ చార్జీలు, కాస్మొటిక్ ఛార్జీల చెల్లింపు, ట్యూటర్ ఫీజు, హాస్టళ్ల మైనర్ రిపేర్లను వెంటనే పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. 13 బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లను మంజూరు చేసి 5,720 నుంది డీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించారు. త్వరలోనే ఆన్ లైన్ తరగతులు కూడా చేపట్టనున్నారు. సివిల్స్ కు ఏటా 100 మందికి శిక్షణ ఇచ్చేందుకు స్టడీ సర్కిల్ను ప్రభుత్వం ప్రారంబించింది. సీఆర్డీఏ పరిధియ ఎవరాలను సివిల్ సర్వీస్ కోచింగ్ భవనం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించనుంది. దీని కోసం ఇప్పటికే భవనానికి సంబంధించిన డీపీఆర్ సిద్ధం కాగా.. 500 మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది.

2014-19 మధ్య విదేశాల్లో చదువుకున్న బీసీ విద్యార్థులకు రూ.81.65 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం నిధులు చెల్లించకుండా బకాయి పెట్టింది. వీటి కోసం 2024-25 బడ్జెట్ లో రూ. 36.11 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

ఉమ్మడి జిల్లాల్లో 13 బీసీ భవనాల నిర్మాణాలకు 2016-17లో నాటి టీడీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 3 భవరాలు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్కో భవను పూర్తికి రూ.5 కోట్లు ఖర్చు కానుండగా పెరిగిన ఖర్చుల నేపథ్యంలో రూ.10 కోట్లు కటాయించాలని తీసి నేతలు కోరుతున్నట్లు సమీక్షలో చర్చించారు.
అయితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడు బీకి ధవరాలు త్వరితగతిన పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. మిగిలిన భవనాల నిర్మాణానికి ఇతర జిల్లాల్లో భూసేకరణ పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి చెప్పారు. బీసీల్లో ఉపాది అవకాశాలు కల్పించేందును.

ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బ లో రూ.896.79 చోట్లు కేటాయిచింది. రుణాల మంజూరుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
గొర్రెల పెంపకందారులకు చేయూతపై సమీక్ష
గొర్రెల పెంపకందారులకు అందించాల్సిన చేయూతపై సమీక్షలో చర్చ జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం 13 జిల్లాల్లో కాపు భవనాల నిర్మాణానికి నిర్ణయించింది.

ఒక్కో భవనానికి రెండు కోట్ల రూపాయల చొప్పున కేటాయించేందుకు అనుమతి తెలిపింది అయితే వీటిలో 4 భవనాల నిర్మాణం మాత్రమే ప్రారంభం కాగా గత ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు.

నిలిచిపోయిన 4 కాపు భవనాలకు కూడా పూర్తి చేసేందుకు అవసరమైన రూ.5.40 కోట్ల విడుదలకు సీఎం అంగీకారం తెలిపారు. గత తెలుగుదేశం ప్రదిుత్వ హయాంలో ఏపీ బ్రాహ్మిణ్ కోళపరేటివ్ ఫైనాన్స్ సొసైటీ ఏర్పాట్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని అదికారులు వివరించగా….ప్రతి సామాజిక వర్గానికి ఇలా కోఆపరేటివ్ ఫైనాన్స్ సోసైటీ ఏర్పాటు చేసి ఆయా వర్గాలను బలోపేతం చేసేందుకు యాలని సీఎం సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *