హైరదాబాద్: నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి మర్రి జంగిరెడ్డి (80) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి వారి స్వగ్రామం తిమ్మాజీపేట మండలం నేరేళ్లపల్లికి తీసువెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.