ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ప్రకాశం తాళ్లూరు మండలంలోని తాళ్లూరు, గంగవరం, రామభద్రపురం, ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో ప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపు కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని రెండు మండలాల్లో భూమి కంపించింది.
మరింతగా భూమి కంపించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలని హెచ్చరిస్తున్నారు.