indias biggest cutout of ra

రామ్ చరణ్ కు దేశంలోనే అతి పెద్ద కటౌట్.. ఎక్కడంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతున్న సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు పీక్స్‌కు చేరాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 29న దేశంలోనే అతి పెద్ద కటౌట్‌ను విజయవాడలో ఆవిష్కరించనున్నారు. బృందావన్ కాలనీలో వజ్రా గ్రౌండ్స్ ఈ విశేష కార్యక్రమానికి వేదిక కానుంది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రారంభం నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ఇప్పటికే శ్రోతల హృదయాలను గెలుచుకుంది. టీజర్ విడుదలైనప్పటినుంచే సినిమా మీద ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం శంకర్ ట్రాక్ రికార్డు ప్రకారం మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందనే విశ్వాసం మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.

ప్రమోషన్లలో భాగంగా అమెరికాలోని డాలస్ నగరంలో డిసెంబర్ 21న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. భారతీయ చిత్రానికి అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి. ఈ వేడుకకు రామ్ చరణ్ ప్రత్యేకంగా హాజరుకాబోతున్నారు. అమెరికాలోని అభిమానులతో కలుసుకోవడం కోసం చరణ్ ఓ వీడియో సందేశం పంచుకున్నారు. ‘‘నమస్తే డాలస్! డిసెంబర్ 21న కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. మీ అందరినీ కలుసుకోవడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’’ అంటూ చరణ్ ఆ వీడియోలో చెప్పారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, కటౌట్ ఆవిష్కరణలు వంటి విశేష కార్యక్రమాలతో గేమ్ చేంజర్ టీమ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. రామ్ చరణ్ మేనియా మరోసారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుందనే నమ్మకంతో అభిమానులు ఈ సినిమాను ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Thank you for choosing to stay connected with talkitup news chat. Stuart broad archives | swiftsportx. Baby bооmеrѕ, tаkе it from a 91 уеаr оld : a lоng lіfе wіth рооrеr hеаlth іѕ bаd nеwѕ, аnd unnесеѕѕаrу.