జైపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శనివారం ఉదయానికి మృతుల సంఖ్య 14కి చేరినట్లు డీసీపీ అమిత్ కుమార్ తెలిపారు.
శుక్రవారం ఉదయం జైపూర్-అజ్మీర్ రహదారిలో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎల్పీజీ ట్యాంకర్ ట్రక్కును ఢీ కొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 37 వాహనాలు మంటల్లో కాలిపోయాయి.
30 మంది పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో 80 మందికిపైగా గాయపడ్డారు. అందులో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్సను అందిస్తున్నమన్నారు. మరోవైపు చనిపోయినవారి కుటుంబాలకు రాజస్థాన్ సర్కారు రూ.5 లక్షలు, ప్రధాని తన జాతీయ సహాయ నిధి తరపున రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాయి. గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష, ప్రధాని సహాయ నిధి రూ.50 వేలు పరిహారంగా ఇస్తామని తెలిపాయి. ఈ ప్రమాదం చాల బాధాకరమని మోడీ తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.