Headlines
cbn jagan

జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఈరోజు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు. రాజకీయ వేదికగా జగన్ , చంద్రబాబు రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేసుకుంటారు. అయినప్పటికీ రాజకీయ వైరాలను పక్కన పెట్టి ఇవాళ (డిసెంబర్ 21) పుట్టిన రోజు జరుపుకుంటున్న జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అని చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు పొందాలని మరియు ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ తన సందేశాన్ని గవర్నర్ తెలియజేశారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి అన్ని వర్గాల నుంచి జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి తమ నాయకుడి పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తున్నారు. వైసీపీ కార్యాలయాలు, ప్రచార వేదికల వద్ద జగన్ ఫొటోలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా కూడా జగన్ పుట్టినరోజు ట్వీట్స్ వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *