Pawan Kalyan will visit Salur today

నేడు సాలూరులో పవన్ కల్యాణ్ పర్యటన

విశాఖ: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. నేడు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం పవన్‌ కల్యాణ్‌ గతరాత్రి గన్నవరం నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు. ఇక ఈరోజు ఉదయం పార్వతీపురం మన్యం జిలా పర్యటనకి విశాఖ నుంచి బయలుదేరారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా ముందుగా నిర్ణయించుకు ప్రకారం గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పర్యటనకి బయలు దేరారు.

ముందుగా ఆయన సాలూరు నియోజకవర్గం పనసభద్ర పంచాయతీ బాగుజోలకు వెళ్తారు. మన్యం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. దాదాపు 36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం పనులను పవన్ ప్రారంభిస్తారు. రోడ్ల నిర్మాణంతో 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి కలుగనుంది. అక్కడ‌ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు. అనంతరం అక్కడ గిగిజనులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.. ఆ కార్యక్రమాలను ముగించుకొని తిరిగి సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు.

కాగా, రేపు కూడా సీఎం పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్రలోనే పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికారకు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎక్కువగా జిల్లాలు, నియోజకవర్గాల వారిగా పర్యటించేందుకు, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపేందుకు పవన్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడం పై ప్రజల్లోనూ, జనసేన వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. పవన్ పర్యటనల ద్వారా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం అవుతుందని, జనసేన గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

In a bronx house fire. Stuart broad archives | swiftsportx. But іѕ іt juѕt an асt ?.