అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్లు డిసెంబరు 18న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన కాల్‌లెటర్లను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదు చేసి కాల్‌లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 29 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం స్టేజ్-2 పీఎంటీ/ పీఈటీ పరీక్షలు డిసెంబర్ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94414 50639 లేదా 91002 03323 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.
ఫిజికల్ ఈవెంట్ల షెడ్యూల్ :
👉 సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
👉 ఏపీఎస్‌సీ కానిస్టేబుల్ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ ఈవెంట్లు ఉంటాయి.
మెయిన్ పరీక్ష విధానం:
👉 ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
👉 సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
👉 ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.